ఢిల్లీలో పోరాటం.. అమరావతికి జై.. కేసీఆర్ నాటకమేంటీ.. మళ్లీ ఆంక్షలేనా.. టాప్ న్యూస్@7PM

పంటలకు కనీస మద్దతు ధర కలిపించాలని కోరామని టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్ తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నుంచి గల్లా జయదేవ్, కనకమేడల హాజరైనారు. విశాఖ స్టీల్స్‌, ఇతరసంస్థల ప్రైవేటీకరణ చేయవద్దని కోరారు. రాజధానుల విషయంలో అనిశ్చితి తొలగించి... అమరావతినే రాజధానిగా కొనసాగేలా చూడాలన్నారు. వరదల ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటించకుండా.. కేవలం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని టీడీపీ ఎంపీలు తప్పుబట్టారు
------
ఏపీ రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు  లాల్ సింగ్ ఆర్య ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ శంఖుస్థాపన చేసిన అమరావతికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్‌‌ని ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది అయితే.. అంబేద్కర్‌కి భారతరత్న అవార్డు రావడానికి ఎంతో కృషి చేశామన్నారు. 
--
ఏపీలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఏపీ జేఏసీ అమరావతి, ఎన్జీవో జేఏసీ ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ వెల్లడించనున్నాయి. ఉద్యమం తప్పదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఏపీలో కొంత కాలంగా పీఆర్సీతో పాటుగా పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అక్టోబర్ నెలాఖరు నాటికే పీఆర్సీపై స్పష్టత ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
-----
కడప జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో రైల్వేకోడూరు- తిరుపతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఊటుకూరు చెరుకు గండి పడే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో గండిపడిన చోట అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఆందోళనలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 
------
తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పెండింగ్ నిధులు, ప్రాజెక్టుల అంశంలో తెలంగాణ బాణీని గట్టిగా వినిపించాలని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదన్న విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ఓపికపట్టామని, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలని నిర్దేశించారు. బాయిల్డ్ రైస్ పై కేంద్రం వైఖరిపై నిలదీయాలని స్పష్టం చేశారు
----
టీఆర్ఎస్, బీజేపీ కలిసి కొత్త నాటకానికి తెర లేపారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.  వరి దీక్షలో మాట్లాడుతూ ఢిల్లీ కెళ్లిన కేసీఆర్..సురేష్‌రెడ్డి ఇంట్లో విందుభోజనం చేసి వచ్చారని తెలిపారు. ప్రధాని మోదీని కలవలేదని, అపాయింట్‌మెంట్ అడగలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వరి మీద అవగాహన లేని మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీని కేంద్రమంత్రి దగ్గరకు పంపితే ఏం మాట్లాడతారు? అని రేవంత్‌ప్రశ్నించారు.
------
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రైతుకు పట్టిన పెద్ద చీడగా మారారన్నారు. ఢిల్లీ వెళ్లి తేల్చుకొస్తానన్న సీఎం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ఢిల్లీలో ఏం జరిగిందో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి భరతం పట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు ఏ పంట వేయాలో చెప్పలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు.
-----
కొత్త కొవిడ్ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరింతగా పునఃసమీక్ష జరపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అత్యవసర సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వీకే పాల్, ప్రధాని ముఖ్య శాస్త్రీయ సలహాదారు డాక్టర్ విజయ్ రాఘవన్, వైద్య ఆరోగ్య, పౌర విమానయాన శాఖల ఉన్నతాధికారులు  ఈ సమావేశానికి హాజరయ్యారు.
-----
కాన్పూర్ టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింకా రహానే సాహసం చేశారు. తాత్కాలిక కెప్టెన్ గానే ఉన్నా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూజీలాండ్ కు కేవలం 284 పరుగుల టార్గెట్ మాత్రమే ఇచ్చి.. భారత సెకండ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఇంకా ఒక రోజు ఆట మొత్తం ఉన్న సమయంలో 284 పరుగుల టార్గెట్ ఉండగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం పెద్ద సాహసమే అంటున్నారు. 
--
టెస్టుల్లో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించి రికార్డు సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌ మరో అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించిన మొదటి భారతీయ క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయంగా పదో ఆటగాడు కావడం విశేషం. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేశాడు