రుద్రమదేవిలో హాట్ భామ న‌థాలియా

 

 

tollywood|Rudrama Devi film|Nathalia Kaur|Nathalia item song

 

 

రామ్ గోపాల్ వ‌ర్మ డిపార్ట్ మెంట్ సినిమాలో ఓ ఐటం సాంగ్ తో ఫేం లోకి వచ్చిన న‌థాలియా కు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. నాగార్జున భాయ్ లో ఓ ఐటం సాంగ్ చేస్తున్న బ్రెజిల్ భామ కు తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. గుణ‌శేఖ‌ర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమ‌దేవిలోఓ కీ రోల్ కు ఎంపికైంది.. రాకుమారి పాత్రకు న‌థాలియాను సెలెక్ట్ చేశాడు గుణ‌శేఖ‌ర్. భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం లో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. రానా వీరభద్రుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకి రచయిత, దర్శకుడు, నిర్మాత గుణశేఖరే కావడం మరో విశేషం.