తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on Oct 21, 2025 10:05AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. తిరుమల భక్తులు
ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల అధికారులు పేర్కొన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(సోమవారం) శ్రీవారిని 72,026 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,304 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు గడిచిన 11 నెలల్లో 2024 నవంబర్ 1 నుండి - 2025 అక్టోబర్ 16వ తేదీ వరకు రికార్డు స్థాయిలో రూ 918.6 కోట్లు విరాళాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడాక టీటీడీకు క్రమంగా దాతలు పెరుగుతున్నాట్లు తెలుస్తోంది