మైనర్ బాలిక పై.. ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం.. 

అపురూపమైనదమ్మా ఆడ జన్మ అని అన్నారు కానీ ఇప్పుడు ఆ మాటే ఆడవాళ్ళ పాలిట శాపంగా మారింది. తల్లిగా, అక్కగా, చెల్లిగా, ఆలిగా, ఇలా ఎన్నో అవతారాలు ఎత్తుతూ నిత్యం మగవాడి విజయం వెనక పరోక్షంగానో ప్రత్యేక్షంగానో తనదైన ప్రభావం చూపుతుంది. ఆ వనిత త్యాగమూర్తులు.  కానీ వారి త్యాగాలకు తూకం వేస్తుంది నేటి సమాజం.. ఆడవాళ్లు అంటే మగవాడి వాంఛ తీర్చే సాధనంగానే చూస్తున్నారు. నలుదిక్కుల ఎక్కడ చూసిన ఆడవాళ్ళ కన్నీళ్లతో ఈ నేల తడుస్తూనే ఉంది. తాచుపాము పగపట్టి కాటు వేసినట్లు ఆడవాళ్లను నిత్యం మగవాళ్ళు కాటు వేస్తూనే ఉన్నారు.  చిన్న, పెద్ద, ముసలి, ముతక, వావివరసలు కూడా చూడకుండా కొందరు దుర్మార్గులు వారి కామ వాంఛలు తీర్చుకుంటున్నారు. బలిచేస్తున్నారు. మగవారి కామ ఖైదీలుగా నేటికీ మహిళలు శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక పై ముగ్గురు మూర్ఖులు సామూహిక అత్యాచారం చేశారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  
 
అది నిజామాబాద్ జిల్లా. కోటగిరి మండలం. ఓ గ్రామంలో మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఓ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మైనర్ బాలురు లను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురులు గ్రామ శివారులోకి తీసుకెళ్లి సామూహిక హత్యాచారానికి ఒడిగట్టారు.

అత్యాచారానికి గురైన బాలిక ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాలికను చికిత్స నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బాలికపై హత్యచారం జరిగినట్లు వెల్లడించడంతో బాధితురాలి తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా ముగ్గురు తనపై సామూహికంగా హత్యచారానికి పాల్పడినట్లు తెలిపింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు కోటగిరి పోలీసులను ఆశ్రయించారు. రుద్రూర్ ఎస్సై రవీందర్ ఈ విషయంపై విచారణ జరిపి ముగ్గురు బాలురలను అదుపులోకి తీసుకొని, పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు.