అన్నమయ్య జిల్లాలో ఏనుగుల  దాడిలో ముగ్గురు మృతి... 10 లక్షల పరిహారం

అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్బంగా  గుండాల కోనకు వెళుతున్న భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. శేషాచలం అడవుల్లో కాలినడకన వెళుతున్న 14 మంది భక్తులను ఏనుగుల మంద దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు  అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  మిగతా వారు ఏనుగుల మంద నుంచి తప్పించుకున్నారు. ఓబులావారి పల్లె మండలం గుండాల కోన ఆటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారికి చెరో 10 లక్షల రూపాయల పరిహారాన్ని  కూటమి ప్రభుత్వం ప్రకటించింది.  మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu