గొంతు పిసికి చంపేశాడు...

 

నల్గొండ జిల్లాలలో ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను హత్యచేసిన తండ్రి రమేష్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల విచారణలో ఈ మూడు హత్యలకు సంబంధించిన వివరాలను రమేష్ వెల్లడించాడు. రమేష్ ముగ్గురు చిన్నారులను చంపాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు తాగించి ముగ్గురు పిల్లలకీ తాగించాడు. ఆ పానీయం తాగి పిల్లలు చనిపోతారని రమేష్ భావించాడు. అయితే అప్పటికీ పిల్లలు బతికే వుండటంతో కర్చీప్‌తో గొంతులు నులిమి ముగ్గురినీ హత్య చేశాడు. పిల్లల్ని చంపిన అనంతరం తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత పిల్లలు హత్యకు గురైనట్టుగా కాకుండా కరెంట్ షాక్‌ వల్ల చనిపోయారని సీన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ముగ్గురు పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు వీరు కరెంట్ షాక్ వల్ల చనిపోలేదని, ఎలుకల మందు తాగించడం, గొంతు నులమటం వల్ల చనిపోయారని నిర్ధారించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu