బెంగుళూరు దోపిడీ కేసులో ముగ్గురు హైదరాబాద్ లో అరెస్టు

బెంగళూరులో జరిగిన భారీ దోపిడీ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.  బెంగళూరులో జరిగిన 7.1 కోట్ల దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను హైదరాబాద్‌ లో స్పెషల్ ఆపరేషన్ ద్వారా అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో పట్టుబడ్డ ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా  బెంగు ళూరు పోలీసుల ప్రత్యేక బృందం హైదరాబాద్‌ వచ్చి ఈ అరెస్టులు చేసింది. దోపిడి తర్వాత ముగ్గురు నిందితులు బెంగళూరు నుంచి కారులో  నేరుగా హైద రాబాద్‌కు చేరుకున్నారు.

హైదరాబాద్ చేరిన తర్వాత ఈ ముగ్గురు నిందితులు నాంపల్లి ప్రాంతంలోని ఒక లాడ్జ్‌లో బస చేశారు. ఈ సమాచారంతో బెంగుళూరు పోలీసులు సిసిఎస్ హైదరాబాద్ బృందం సహకారంతో లాడ్జ్ పరిసరాల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు చేరుకునేలోపే ముగ్గురు నిందితులు లాడ్జ్‌ను విడిచి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ. 58లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.  అరెస్టు చేసిన వారిని బెంగళూరు తరలించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu