వాహనాల ఇన్స్యూరెన్స్ పెరిగిపోయింది!.. థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ప్రీపియం పెంచుతూ ఉత్తర్వులు

ఇక వాహనాల ఇన్స్యూరెన్స్ వ్యయం పెరిగింది. వాహనదారులు వెహికల్ ఇన్స్యూరెన్స్ కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫోర్ వీలర్, టూ వీలర్ వాహనాలు వాటి సీసీ సామర్థ్యం ఆధారంగా థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం పెంచుతూ ఉత్వర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు ఫోర్ వీటర్ కార్లు ధౌజెండ్ సీసీ లోపు ఇంజిన్ సామర్ధ్యం కలిగిన వాటికి గతంలో రూ. 2072గా ఉన్న ఇన్స్యూరెన్స్ పెంచిన రేట్ల ప్రకారం 2094 రూపాయలకు పెరుుగతుంది.

అలాగే ధౌజండ్ సీసీ నుంచి 1500 సీపీ వరకూ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కార్లకు ఇక ఇన్స్యూరెన్స్ 7,897కు పెరుగుతుంది. గతంలో ఇది 3, 416 రూపాయలుగా ఉంది. అలాగే  టూవీలర్లకు కూడా ఇన్స్యూరెన్స్ పెరుగుతోంది. తాజా ఉత్తర్వుల మేరకు టూవీర్లు 150 నుంచి 350 సీసీ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన టూవీలర్లకు ఇన్స్యూరెన్స్ 1, 366 రూపాయలకు పెరిగింది. అదే అంతకు మించిన సామర్ధ్యం కలిగిన టూవీలర్లకు 2804 రూపాయలు ఇన్స్యూరెన్స్ చెల్లించాల్సి ఇకపై ఉంటుంది