హెల్త్ ఇన్సురెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
posted on Oct 14, 2025 9:30AM

నిన్నటి వరకు లైఫ్ ఇన్సురెన్స్ కు డిమాండ్ ఉండేది. ఇప్పుడు వెహికల్స్ కు, ఇల్లు కొనుగోలుకు.. ఇలా అన్నింటికి ఇన్సురెన్స్ వచ్చింది. అయితే ఈ ఇన్సురెన్స్ లు ఒక ఎత్తు, హెల్త్ ఇన్సురెన్స్ ఒక ఎత్తు. నేటి కాలంలో కుటుంబంలో ఎవరో ఒకరు ఏద ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా చాలా మంది హెల్త్ ఇన్సురెన్స్ మీద చాలా దృష్టి పెడుతున్నారు. వీటికి తగ్గట్టు ఇప్పట్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రమోషన్లు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకునే ప్రతి ఒక్కరు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. అవేంటో తెలుసుకుంటే..
హెల్త్ హిస్టరీ..
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకునే ముందు కుటంబంలో ఎంత మంది ఉంటే అంత మంది ఆరోగ్యం గురించి పూర్తీగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా పూర్తీగా అందరి గురించి ఆలోచించుకుంటే మంచి ప్లాన్ ఎంచుకోవడానికి, తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ కుటుంబ సభ్యుల ఆరోగ్య చికిత్సకు చక్కగా సహాయపడుతుంది. అలా కాకుండా అందరూ ఎక్కువగా ఏది తీసుకుంటున్నారు? ఆర్థికంగా ఏది బాగుంది అనేవి చూసి తీసుకుంటే.. ఆ తర్వాత అది కుటుంబ సభ్యులకు ఉపయోగపడదు.
క్లెయిమ్ టైమ్..
ఆరోగ్య భీమాకు క్లెయిమ్ టైమ్ డేట్ ఉంటుంది. ఈ గడుపు తేదీ తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. కాబట్టి పాలసీ క్లెయిమ్ కోసం వెయిటింగ్ డేట్ ను చెక్ చేసుకోవాలి.
సాధారణంగా కంపెనీలు ఈ వెయిటింగ్ పిరీయడ్ ను 30 రోజులుగా అమలుపరుస్తుంటాయి. అయితే కొన్ని అనారోగ్యాలకు ఈ వ్యవధి చాలా ఎక్కువ అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకునే ముందు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
సెటిల్మెంట్ పర్సెంటేజ్..
హెల్త్ ఇన్సురెన్స్ తీసుకునేటప్పుడు కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని చెక్ చేయాలి. ఎక్కువ సెటిల్మెంట్ నిష్పత్తి ఉంటే తరువాత క్లెయిమ్ లకు దారితీయవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి.
ప్రీమియంతో తప్పటడుగు..
చాలామంది తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇలా తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీలు చాలా వరకు అంత మంచిగా ఉండవు. ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉన్నా సరే.. అది ఆరోగ్య అవసరాలకు బాగా సహాయపడే ప్లాన్ ను మాత్రమే ఎంచుకుంటే బెటర్.
రిలెటెడ్ హాస్పిటల్స్..
హెల్త్ ఇన్సురెన్స్ ఏ కంపెనీ నుండి తీసుకుంటే.. ఆ కంపెనీ కి రిలేటెడ్ గా ఉన్న హాస్పిటల్ లిస్ట్ ను తప్పనిసరిగా చెక్ చేయాలి. ఇలా చేయడం వల్ల డబ్బు కట్టకుండా హెల్త్ ఇన్సురెన్స్ కింద ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం లభిస్తుంది. ఒక కంపెనీకి ఎక్కువ నెట్వర్క్, హాస్పిటల్స్ లిస్ట్ ఎక్కువ ఉంటే అది బాగా సహాయపడగలుగుతుంది.
క్లెయిమ్ రూల్స్..
కొన్ని కంపెనీలు పేషెంట్ కనీసం 24 గంటలు హాస్పిటల్ లో చేరితేనే క్లెయిమ్ లను చెల్లిస్తాయి. అలాంటి సందర్బాలలో ఆ అవసరాన్ని మినహాయించే డే కేర్ సౌకర్యం ఉందా లేదా అనేది చూసుకోవాలి.
కండిషన్స్, రూల్స్..
హెల్త్ పాలసీ అయినా, జీవిత భీమా అయినా, వేరే ఇన్సురెన్స్ అయినా.. ఏదైనా సరే.. భీమాను కొనుగోలు చేసేముందు దాని కండిషన్స్, రూల్స్ ను తప్పకుండా చదవాలి. వాటిలో మినహాయింపులు, రూల్స్ ను, అలాగే పేమెంట్స్ ఇలా అన్ని అంశాలను కూడా చెక్ చేసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చాక మాత్రమే కొనుగోలు చేయాలి.
*రూపశ్రీ.