భయం నా బయోడేటాలోనే లేదు.. లోకేష్

భయం నా బయోడేటాలో లేదు. నాది రాయలసీమ బ్లడ్.. పౌరుషం నా ఇంటి పేరు అంటూ లోకేష్ పల్నాడులో సింహ గర్జన చేశారు.  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు లోకేష్ పల్నాడు పర్యటనకు ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా వాటన్నిటినీ అధిగమించి ముందుకే కదిలారు.  పల్నాడు గడ్డపై నుంచి ఆయన అధికార పార్టీకి సవాళ్లు విసిరారు. విమర్శల తూటాలు  పేల్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డిని జగన్మోసం రెడ్డిగా అభివర్ణించారు. గత ఎన్నిక‌ల‌కి ముందు జ‌గ‌న్‌  అన్నీ పెంచుకుంటూ పోతాన‌న్నాడు జ‌నం ఏమో సంక్షేమ ప‌థ‌కాలు పెం చుతూ పోతాడేమో అని ఆశ‌ప‌డ్డారు. సీఎం అయ్యాక ఆయన అన్నీ పెంచేశారు. అ

యితే అవి సంక్షేమ పథకాలు కాదు.. ప‌న్నులు, చార్జీలు అన్నారు. అందుకే ఆయన  జ‌గ‌న్ రెడ్డి కాదు ఆయ‌న జ‌గ‌న్మోసం రెడ్డి  అని లోకేష్ అన్నారు. త‌న‌ను ఎవ రూ పీక‌లేర‌ని విర్ర‌వీగుతున్న జ‌గ‌న్‌రెడ్డి సెక్యూరిటీ లేకుండా బ‌య‌ట‌కొస్తే జ‌న‌మే వెంట్రు క‌ల‌న్నీ పీకి పంపుతార‌ని  నారా లోకేష్ హెచ్చ‌రించారు. ప‌ల్నాడు జిల్లా రావ‌లాపురంలో జ‌ల్ల‌య్య కుటుం బాన్ని ప‌రామ‌ర్శించిన అనంత‌రం టిడిపి కార్య‌క‌ర్త‌ల‌ని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు.  చంద్ర‌బాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయితే  గంజాయి, పిచ్చి మందుకి బ్రాండ్  అంబాసిడ‌ర్ జ‌గ‌న్  అని అన్నారు.

రాష్ట్రంలో అస‌లు సిస‌లు పాల‌న‌, అభివృద్ధి తెలుగు దేశం వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ప‌సుపు జెండాని ప్రాణంగా ప్రేమించే తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల‌కి  పాదాభివంద‌నం. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌ల్లో ఏపీ ని  మూడ‌వ స్థానానికి చేర్చార‌న్నారు. ఈ మూడేళ్ల‌లో పంట‌ల‌కి గిట్టుబాటు ధ‌ర లేదు, ఏడాదికి ఇస్తామ‌న్న మూడు వేల కోట్ల ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి లేదు. రైతుల‌కు భ‌రోసా ఇవ్వ‌లేక‌పోవ డ‌మే రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌న్నారు.  ఆడ‌బిడ్డ‌ల‌కి న్యాయం చేయాల‌ని నేను పోరాడితే అక్ర‌మంగా అరెస్టు చేశారు..ఎన్నిసార్ల‌యినా అరెస్టు చేసుకోండి. భ‌యం నా బ‌యోడేటాలో లేదన్నారు.

వైకాపా కుక్క‌లు నా మీద రాళ్లు వేయించాయి. రాళ్లు వేస్తే పారిపోను..నాది రాయ‌ల‌సీమ  బ్ల‌డ్‌..పౌరుషం నా ఇంటి పేర‌న్నారు. అమ్మ ఒడి మిగిలించుకోవ‌డానికి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో నాలుగు ల‌క్ష‌ల మందిని ఫెయిల్ చేసి విద్యార్ధుల‌కు అన్యాయం చేశాడ‌ని జగన్ పై లోకేష్‌ ఘాటు విమర్శలు గుప్పించారు.