క్రెడిట్ కార్డులతో జర భద్రం తమ్ముడూ!

అప్పు ఆకర్శించని మనిషి ఎవరైనా ఉంటారా ? ఎవరూ ఉండరనే చెప్పాలి. దీన్నే ఆసరాగా చేసుకుని కార్పొరేట్ బ్యాంకులు, సంస్థలు ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్ కార్డులను ఇస్తుంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డుల వినియోగంలో సింహభాగం యువతదే! ఈ ప్రీ క్రెడిట్ వ్యామోహంలో పడి ఫైనాన్సిల్ మానేజ్మెంట్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది యువత. తద్వారా వడ్డీలు కట్టలేక ఒత్తిడికి లోనై కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

మనం క్రెడిట్ కార్డ్ నుంచి వినియోగించుకున్న మొత్తం సొమ్ముని ఔట్ స్టాండింగ్ అమౌంట్ అంటారు. ఈ మొత్తాన్ని చెల్లించడానికి బిల్ జనరేట్ అయిన తర్వాత 20 నుంచి 25 రోజుల వ్యవదిలో కార్డుకి ఆ మొత్తాన్ని జమ చేయాలి. లేదా అలా మొత్తాన్ని కట్టలేని పక్షంలో మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. మినిమం డ్యూ అమౌంట్ కట్టమని ఉంటుంది. అంటే మనం వాడుకున్న మొత్తానికి ఇది వడ్డీ మాత్రమే! ఇక్కడే మనవాళ్ళు తప్పులో కాలేస్తుంటారు. కట్టాల్సిన అసలు వదిలేసి మినిమం డ్యూ అమౌంట్ తక్కువ ఉంది కదా అని ఆ పేమెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలా కట్టడం ద్వారా తమ అసలు కట్టాల్సిన నగదు తగ్గుతూ వస్తుంది అనుకుంటారు. అలా ఎప్పుడూ జరగదు. మినిమం డ్యూ అమౌంట్ కడుతున్నంత కాలం కట్టాల్సిన అసలు మాత్రం అలానే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వడ్డీ ఛార్జీలపై పెద్దగా అవగాహన లేని వారు ఇలా కొన్ని నెలలు చెల్లించాక గానీ విషయం గ్రహించరు. అప్పటికే వీలైనంత వరకు మన జేబుల్ని ఖాళీ చేస్తుంది క్రెడిట్ కార్డ్.

అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా కేవలం నష్టమే కాదు లాభాలు కూడ ఉన్నాయి అని చెప్పాలి. అత్యవసర పరిస్థితుల్లో రుణ వేసులుబాటుని కల్పిస్తుంది. అయితే బిల్ జనరేట్ అయిన తర్వాత సకాలంలో తిరిగి చెల్లిస్తే ఎటువంటి వడ్డీ చార్జీలు ఉండవు. కానీ ఎప్పటికప్పుడు కొత్త ఆర్ధిక సంస్కరణలతో రుణ నిబంధనలు మార్చుకునే బ్యాంకుల పై కొంత అవగాహనతో మనం వీటిని వినియోగించుకోవాలి. ఇకనుంచి క్రెడిట్ కార్డ్ వినియోగించే ముందు పూర్తి కంపెనీ కస్టమర్ కేర్ కి కాల్ చేసి పూర్తి సమాచారంతో కార్డుని వినియోగిస్తే మంచిది.

డబ్బుని సంపాదించడమే కాదు ఎలా వినియోగించుకోవాలో కూడా తెలుసుకోవాలి. దీన్నే ఆర్ధిక క్రమశిక్షణ అంటారు. క్రెడిట్ ఆకర్షణల్లో పడి అవసరం లేకున్నా అందుబాటులో ఉంది కదా అని వాడేస్తే కుదరదు. కార్పొరేట్లు వడ్డీలతో మనల్ని పీల్చి పిప్పి చేస్తారు. ఏ స్నేహితుడో పక్కింటివాడో అయితే కాస్త ఆలస్యం అయినా ఊరుకుంటాడు. కానీ ఇక్కడ బ్యాంకు ప్రతినిధిలు, యంత్రాలు ఫోన్లు చేసి మాట్లాడతాయి. నీ సమస్యలు, కష్టాలు ఇవేమీ పట్టవు వాటికి. చెల్లింపుల్లో మరింత ఆలస్యం అయితే కోర్ట్ నోటీసులు కూడా పంపిస్తారు. కాబట్టి క్రెడిట్ కార్డు కి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండండి. తప్పని పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రంగానే దాన్ని వాడండి.

◆వెంకటేష్ పువ్వాడ
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu