బావ ప్లాన్ తో.. ఒక్క  దెబ్బకి రెండు పిట్టలు.. 

రా హేయ్ రా.. అదే ఏదోటి చేసెయ్యిరా.. చిన్నడోవైపు పడ్డదోవైపు.. చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు అని పడుకున్నట్లు. ఇద్దరి మరదళ్ల ముద్దుల బావ అతను. ఒక మరదలికి తెలియకుండా మరొక మరదలితో దాగుడు మూతలు.. ఆడాడు ఆ బావ. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇద్దరినీ ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. స్వయానా మేనత్తల కూతుళ్లు కావడంతో ఆ ఇద్దరూ ఆ బావకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. చివరికి  పెళ్లి కూడా ఇద్దరినీ చేసుకోవాలని ఉందని ప్రపోజల్ పెట్టాడు. ఇంతకీ ఈ వింత కథ ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.. మీరే చదివి తెలుసుకోండి.. 

అది ఆదిలాబాద్ జిల్లా. ఉట్నూర్ మండలం. ఘనపూర్​ గ్రామం. ఆ గ్రామానికి చెందిన వ్యక్తి. అతని పేరు అర్జున్. అతను  ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. అర్జున్ కు ఇద్దరు మేనత్తలు ఉన్నారు. వారికి  ఆడ సురేఖ,  కనక ఉషారాణి అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. వీరిలో ఉషారాణిది ఘన్ పూర్ కాగా, సురేఖ ది శంభూగూడ గ్రామం. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు, అర్జున్ ఏకకాలంలో ఒకరికి తెలియకుండా ఒకరికి ప్రేమ కుర్చీఫ్ వేసి. గత  మూడు సంవత్సరాల నుండి ప్రేమించాడు. చివరికి పెళ్లి కూడా ఇద్దరినీ చేసుకోవాలని ఉందని ప్రపోజల్ పెట్టాడు. ఆ ఇద్దరూ కూడా అందుకు సరేననడంతో పెద్దల అంగీకారంతో ఊరందరి సమక్షంలో సంప్రదాయబద్దంగా ఒకే మండపంలో ఇద్దరి మెడలో తాళి కట్టి జంట ముగ్గురయ్యారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆసక్తికర పెళ్లి జరిగింది.

నెల రోజుల క్రితం ఇద్దరినీ ప్రేమిస్తున్న సంగతి మరదళ్లకు చెప్పగా వాళ్ళు కూడా పెళ్ళికి ఒకే చెప్పారు. మూడు కుటుంబాల సభ్యులతో మాట్లాడిన ఆ ముగ్గురు బావ మరదళ్ళు గ్రామ పెద్దలతో మాట్లాడి వారిని పెళ్ళికి ఒప్పించారు. దీంతో పెద్దల సమక్ష్యంలో ఈ నెల 14వ తేదిన ముహుర్తం కుదుర్చుకొని ఘన్ పూర్ లో ఆ యువకుడు ఒకే పెళ్లి పందిరిలో గిరిజన సంప్రదాయం ప్రకారం ఇద్దరు యువతుల మెడలో తాళి కట్టి పెళ్ళిచేసుకున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.