థాయిలాండ్-కాంబోడియా మధ్య సీజ్ ఫైర్

 

థాయిలాండ్ - కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే సీజ్‌ఫైర్ అమలు చేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. కాగా జూలై 24 నుంచి థాయిలాండ్-కాంబోడియా దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.  

నాలుగురోజుల థాయ్‌-కంబోడియా సరిహద్దు ఘర్షణలతో 34 మంది మరణించగా, లక్షా 68వేల మంది నిర్వాసితులు అయ్యారు. యుద్ధం ఆపేందుకు థాయ్‌-కంబోడియా నేతలతో తాను మాట్లాడానని, వారు చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ట్రంప్‌ ప్రకటించారు. మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం ఆహ్వానం మేరకు థాయ్‌ తాత్కాలిక ప్రధాని పుమ్తామ్‌ వేచాయచాయ్‌ ఇవాళ చర్చలు సఫలం అయ్యాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu