దేశానికి ఉగ్ర ముప్పు .. భ‌య‌పెడుతోన్న అస్సోం ఘ‌ట‌న‌

దేశ‌ర‌క్ష‌ణ అంశాన్ని ప‌రిశీలిస్తే ఒకింత భ‌య‌మేస్తుంది. మ‌నం నిజంగానే  సుర‌క్షితంగా వున్నామా అన్న ప్ర‌శ్న పెద్ద‌ద‌యి వొణికిస్తోంది.  దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉగ్ర‌దాడుల‌కు ఆస్కారం వుంటోం ది. ఒక‌దాని  త‌ర్వాత మ‌రొక‌టి పెనుముప్పులు పొంచి వుంటున్నాయి. ప్ర‌భుత్వాలు మారినా, సైన్యం మూడు విభాగాలూ ఎంతో అప్ర‌మ‌త్తంగా వున్నన్నా..  ఉగ్ర‌దాడుల ముప్పు రోజు రోజుకూ పెరుగుతోంది.  కేంద్రం లో బిజెపి ప్ర‌భుత్వం దేశ ర‌క్ష‌ణ అంశంలో ఎంతో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, సైన్యాన్ని బ‌లోపేతం చేయ‌డానికే కొత్త సైనిక‌రంగ ప‌థ‌కాలు అమ‌లుచేస్తున్నామ‌ని భారీ ప్ర‌చారం చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ దేశంలో ఏదో ఒక మూల ఉగ్ర‌దాడి చిన్న‌దో పెద్ద‌దో జ‌రుగుతూనే వుంది. 

భార‌త దేశంలోని కొన్ని న‌దులు, ఆన‌క‌ట్ట‌లు, ఇత‌ర క‌ట్ట‌డాల‌కు ముప్పు పొంచి వుంద‌ని నిపుణుల అంచ నా.  ఇటువంటి వార్త‌లు వింటున్న‌పుడు ఒక్క‌సారి వెన్నులో వొణుకు రావ‌డం ఖాయం.  ఒక‌టి రెండు సార్లు భారీ ఉగ్ర‌దాడుల‌కు దేశం ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చిందో జనం ఇంకా మరచిపోలేదు. ఉగ్ర‌సంస్థ‌లు ఏదో విధంగా దేశం లోకి   ప‌క్క దేశాల నుంచి దాదాపు నిరంతరంచొచ్చుకురావ‌డం గ‌మ‌నిస్తూనే వున్నాం. ముఖ్యంగా  పాకి స్తాన్ ప్ర‌భుత్వం త‌మ త‌ప్పేమీ లేద‌ని వాద‌న చేస్తున్న‌ప్ప‌టికీ, భార‌త్‌తో శాంతినే కోరుకుంటున్నా మ‌ని నీతులు చెబుతున్న‌ప్ప‌టికీ దాడులు మాత్రం ఏదో ఒక చోట‌, ఏదోవిధంగా జ‌రుగుతూనే వున్నాయి. వాటిలో పాల్గొన్న‌వారు త‌ప్ప‌కుండా పాక్ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు చెంద‌న‌వారే వుండ‌డం గ‌మ‌నార్హం. అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద భార‌త్ ఎంత గొంతు చించుక‌న్న‌ప్ప‌టికీ పాక్ విష‌యంలో అంత‌ర్జాతీయ సంస్థ ల‌న్నీ గ‌ట్టిగా హెచ్చ‌రించిన‌ట్టు న‌టిస్తున్నాయంతే.  
అసోంను వ‌ర‌ద‌లు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. అయితే  అది ప్ర‌కృతి వైప‌రీత్యం కాద‌నే అనుమానా లు తలెత్తుతున్నాయి. బ‌రాక్ న‌ది క‌ట్ట‌ను కావాల‌నే కూల్చేశారు. అసోంలో వరద బీభత్సం భయానకంగా ఉంది.  ప్ర‌భుత్వం స‌కాలంలో స్పందించి వంద‌లాదిమంది ప్రాణాల‌ను కాపాడింది.  ఇది కేవ‌లం ప్ర‌కృతి వైప‌రీ త్యం కాద‌ని, దుండ‌డులు చేసిన దారుణ కృత్య‌మ‌ని ఆన‌క తెలిసి  దేశం భ‌యంతో వొణికింది.  ఇదే కాదు సిల్చార్ వ‌ర‌ద‌ల‌కు కార‌ణ‌మైన బ‌రాక్ న‌ది క‌ట్ట కూల‌డం వెనుక మిదున్ హుసేన్ ల‌ష్క‌ర్‌, కాబుల్ ఖాన్ ల‌నే ఉగ్ర‌వాదుల ప‌నే అని తేలింది.  వారిని కాచ‌ర్ ప్రాంత పోలీసులు అరెస్టు చేశారు. 

క‌ర‌క‌ట్ట‌ల సంర‌క్ష‌ణ క‌ట్టుదిట్టం చేయ‌డం ఒక్క‌టే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌ను  అడ్డుకుంటుందా?  నిత్య నిఘా ఏర్పాట్లు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే విధ‌మైన జాగ్ర‌త్త‌లూ తీసుకుంటూండ‌ట‌మే ప్ర‌భుత్వం చేయ‌ద‌గ్గ ప‌ని.  ఎందుకంటే ఎవ‌రు ఏ స‌మ‌యంలో దాడి చేస్తున్నార‌న్న‌ది ప్రతిసారి ముంద‌స్తు స‌మాచారం అంద‌డం, నిఘాసంస్థలు కనిపెట్టడం అన్నది సులభ సాధ్యం కాదు. ఘటన జ‌రిగిన త‌ర్వాత అతిజాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కంటే  ముందుగా ప‌టిష్ట భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం మేలు. ఈ దిశగా  ప్ర‌భుత్వాలు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎన్ని హామీలు యిస్తున్న ప్పటికీ  ఇటువంటి సంఘ‌ట‌న‌లు  ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను వెక్కిరిస్తూనే వున్నాయి. క‌నుక ప్ర‌జ‌లూ అప్ర‌మ త్తంగా వుండ‌డం అవ‌స‌ర‌మ‌న్న నినాదాలు ప్ర‌చార‌మ‌వుతున్నాయి. ఉగ్ర‌దాడు ల‌తో ఇళ్లు కూల‌డం  మ‌నుషుల ప్రాణం పోవ‌డం ఇంత‌వ‌ర‌కూ వింటున్నాం, చూస్తున్నాం.  కానీ  జ‌ల వ‌న రుల మీద జ‌రిగే ఇటువంటి దాడులు ఇప్పుడు ఉగ్రమూకల కొత్త ఎత్తుగడగా కనిపిస్తోంది.    దేశ జ‌ల‌శ‌క్తిని రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలసిన అవసరాన్ని అసోం ఘటన ఎత్తి చూపుతోంది.   ఏది ఏమైనా అసోం ఘటన దేశానికి విద్రోహ శక్తుల నుంచి ఏ స్థాయిలో ప్రమాదం పొంచి ఉందో తేటతెల్లం చేసింది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం కావలసిన ఆవశ్యకతను ఈ సంఘటన గట్టిగా చెబుతోంది.