రేపటి నుంచి సినిమా షూటింగ్స్ బంద్?
posted on Aug 21, 2014 11:23AM
.jpg)
ఇప్పటికై సరైన హిట్లు లేక బేర్‌మంటున్న తెలుగు సినిమా పరిశ్రమకి కొత్త కష్టం వచ్చిపడింది. రేపటి నుంచి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తామని తెలుగు సినిమా కార్మికుల సమాఖ్య ‘ఫిలిం ఫెడరేషన్’ హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వానికి, సినిమా రంగానికి మధ్య వారధిగా వుండే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి నోటీసు ఇచ్చింది. తమకు సరైన వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌తో ఫిలిం ఫెడరేషన్ బంద్ పిలుపు ఇచ్చింది. ఫెడరేషన్ చెప్పినట్టుగా వేతనాలను సవరింకపోతే రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు నిలిచిపోయే అవకాశం వుంది. దాంతో ఇప్పటికే మూలిగే నక్కలా వున్న సినిమా పరిశ్రమ నెత్తిన బంద్ రూపంలో తాటికాయ పడే ప్రమాదం వుంది. అయితే సినిమా కార్మికులు బంద్ చేయకుండా చూడటానికి సినిమా పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.