Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బెయిలు
posted on: Apr 28, 2026 1:22PM
.webp)
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో అరెస్టైన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. మార్చి 14 రాత్రి మొయినాబాద్ ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ కేసులో పైలెట్ రోహిత్ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. రోహిత్ రెడ్డి బెయిలు పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు మంగళవారం (ఏప్రిల్ 28) ఆయనకు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ ముగ్గురిలో బెయిల్ కోసం రోహిత్ రెడ్డి ఒక్కరే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో అరెస్టైన ముగ్గురిలో మొదటిగా రోహిత్ రెడ్డి బెయిలుపై బయటకు వచ్చారు.
విచారణ సందర్భంగా రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు వివిధ అంశాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, అవస రమైనప్పుడు విచారణకు హాజరవుతారని కోర్టుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, కండీషన్డ్ బెయిల్ మంజూరు చేసింది.



.webp)


