అఖిలపక్షం హాట్ హాట్
posted on Dec 10, 2014 10:47AM

హైదరాబాద్‌లోని పలు సమస్యల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం హాట్ హాట్‌గా జరిగినట్టు తెలిసింది. అనేక అంశాలు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షం ముందు వుంచినప్పటికీ ఒక్క విషయంలోనే ఏకాభిప్రాయం కుదిరిందని తెలుస్తోంది. మిగతా అంశాలను ఈనెల 16న జరిగే మరో అఖిలపక్ష సమావేశంలో మరోసారి చర్చించాలని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో హైదరాబాద్‌లో భూ కబ్జాలు, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటం, మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్పు తదితర అంశాల మీద చర్చ జరిగింది. అయితే పేదలు నివాసం వుంటున్న 60 నుంచి 125 గజాల స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరించాలన్న అంశంలో మాత్రం అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. మిగతా అనేక అంశాల మధ్య ప్రతిపక్షం - అధికార పక్షం మధ్య హాట్ హాట్‌గా చర్చ జరిగిందట. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉందని, ప్రతిపక్షాలు సహకరించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.