బీసీ బంద్‌లో దాడులకు పాల్పడిన 8 మంది అరెస్ట్

 

తెలంగాణలో నిన్న జరిగిన బీసీ బంద్‌లో దాడులకు పాల్పడిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారులు షాపులు మూసేయలేదని కొందరు దాడులకు పాల్పడ్డారు. అలాంటి వారిని గుర్తించిన పోలీసులు హైదారాబాద్‌లోని నల్లకుంట, కాచిగూడ, పోలీసు స్టేషన్‌లలో పలు సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం నిన్న బీసీ బంద్‌కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు. ఈ బంద్‌ పిలుపుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీతో పాటు అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి.

ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయితే ఈ బంద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో కొంత మంది నేతలు హద్దులు దాటి పలు షాపులు, పెట్రోల్ బంకులు, చిరువ్యాపారుల సముదాయాలపై దాడులు చేశారు.. 8 మంది బీసీ నేతలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అరెస్ట్‌లను రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యను ఖండించారు. అలాగే బీసీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu