మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ

 

తెలంగాణలో మద్యం షాపులకు రోజు రోజుకి దరఖాస్తుల వెల్లువ కొనసాగుతుంది. శనివారం చివరి రోజు కావడంతో సాయంత్రం నుంచి గంట గంటకు   దర ఖాస్తులు పెరు గుతూ వస్తున్నాయి. శుక్రవారం నాటికి 2620 మద్యం షాపులకు 50 వేల దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు దరఖాస్తులు 30 వేల నుంచి 40 వేల వరకు  పెరిగే అవకాశం ఉన్నట్లు  ఎక్సైజ్‌ శాఖ భావిస్తుంది. 

గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తులు తగ్గిన ఆదాయం మాత్రం  పెరిగే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్‌ శాఖ అంచనాలు వేసుకుంటున్నారు.సెప్టెంబరు 27 నుంచి మొదలైనా దరఖాస్తుల స్వీకరణ తొలుతగా  మంది కొడిగా కొనసాగింది. కాని చివరి మూడు రోజు లుగా ముందస్తుగా అనుకున్న రీతిలో దరఖాస్తులు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. శనివారం రాత్రి వరకు గ్రాండ్‌ టోటల్‌గా 80 వేల నుంచి 90 వేలకు  పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా అధికా రులు అంచనాలు వేస్తున్నారు. 

సాయంత్రం 5 గంటల లోపు వచ్చిన వారి టో కన్లు ఇచ్చి వారి  దరఖాస్తులను తీసుకుంటారు. ఏపీకి చెందిన ఓ మహిళ ఏకంగా 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసింది. ఇందుకోసం రూ.4 కోట్ల 50 లక్షలు చెల్లించింది. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu