జీవో 317తో టీచ‌ర్ల‌కు తీవ్ర న‌ష్టం ... టీడీపీ నేత అశోక్‌

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. యాప్‌ని డౌన్లోడ్  చేసుకోమంటూ రెండో రోజు సెల్‌డౌన్ కొనసాగించారు. ఉపా ధ్యాయ సంఘాలకు మద్దతుగా ఆందోళనలో టీడీపీ నేత అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యా య సంఘాల నేతలు మాట్లాడుతూ  ప్రభుత్వ విధానాలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని స్పష్టం చేశారు. తమ సెల్ ఫోన్ లలో యాప్ డౌన్లోడ్‌నుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 

317 జీవో కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిం చేందుకు గతంలోనూ హామీ ఇచ్చినా.. కనీసం చర్చించడం లేదన్నారు. కేవలం ప్రభుత్వానికి మద్దుతు ఇచ్చేవారితో చర్చించి.. వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బదిలీలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. జీవో 317 కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. సమస్యలు పరిష్కరించేందుకు గతంలోనూ హామీ ఇచ్చారు. అయినా కనీసం చర్చిం చడంలేదు. ఇప్పటికైనా బదిలీలు చేపట్టాలి. 

వ్యక్తిగత సమాచారం చోరీ కోసమే యాప్ డౌన్లోడ్‌పై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని  అశోక్ ఆరోపించారు. ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచారం మాకెందుకు అంటూనే, మీరెక్కడెక్కడ తిరుగుతున్నారో మా వద్ద సమాచారం ఉందని అధికారులు బెదిరిస్తున్నార‌ని తెలిపారు.  ప్రభుత్వం ఇదే తరహా ఒత్తిడి కొనసాగిస్తే సెల్ డౌన్‌తో పాటు యాప్ డౌన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ డిమాండ్లు అంగీకరించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడమన్నారు. జగన్మోహన్ రెడ్డి నూతన విధానం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.