నాని తిడితే ఒప్పు.. అయ్య‌న్న తిడితే త‌ప్పా? వైసీపీకి టిట్ ఫ‌ర్ టాట్‌!

బూతు..బూతు..బూతు.. మంత్రి కొడాలి నాని మాట్లాడితే.. బీప్ సౌండ్ లేకుండా నేరుగా ప్ర‌సారం చేయ‌లేని దుస్థితి. ప్ర‌భుత్వ మంత్రిగా కాకుండా.. బూతులు మాట్లాడే మంత్రిగానే నాని ఫుల్ ఫేమ‌స్‌. ఆయ‌న నోరు తెరిస్తే బూతు. ఆయ‌న మాట్లాడితే బూతు. ఆయ‌న విమ‌ర్శిస్తే బూతు. బూతు లేకుండా ఒక్క ముక్క కూడా మాట్లాడ‌లేరంటారు. అలా బూతుల‌కు, తిట్ల‌కు.. కేరాఫ్ అడ్ర‌స్‌, బ్రాండ్ అంబాసిడ‌ర్‌లు వైసీపీ నేత‌లే. కొడాలి నాని, అనిల్‌కుమార్ యాద‌వ్ లాంటి వాళ్లు తిట్ల‌తోనే జ‌గ‌న్‌ను మెప్పించి మంత్రి ప‌ద‌వులు కాపాడుకుంటున్నార‌ని అంటారు. 

అలాంటిది ఓపిక ప‌ట్టీ ప‌ట్టీ.. తాజాగా టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు సైతం తామేమ‌న్నా త‌క్కువా అన్న‌ట్టు వైసీపీకి అర్థ‌మ‌య్యే బాష‌లోనే మాట్లాడ‌టం అధికార‌పార్టీకి మింగుడుప‌డ‌టం లేన‌ట్టుంది. ప్ర‌జాస‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతూ అయ్య‌న్న‌పాత్రుడు రెండు మాట‌లు జారారు. మంత్రి కొడాలి నాని మాట‌ల‌తో పోలిస్తే అవేమంత బూతు మాట‌ల‌కు కానేకావు. ఏం పీకుతారు.. నా కొ-కా లాంటి బూతుల్లో కాస్త ఏ గ్రేడ్ ప‌దాలే వాడారు. కొడాలి నానిలా అమ్మ మొ-డు లాంటి అస‌భ్య ప‌దాల జోలికి పోలేదు. అయినా.. అన్నేసిసార్లు చంద్ర‌బాబును ప‌ట్టుకొని అన్నేసి మాట‌లు అన్న వైసీపీ నేత‌లు.. మొద‌టిసారి అయ్య‌న్న‌పాత్రుడు జ‌గ‌న్‌ను రెండంటే రెండే తిట్లు తిట్ట‌డాన్ని వారు స‌హించ‌లేక‌పోయారు. మా నాయ‌కుడిని ప‌ట్టుకొని అంత మాట అంటారా అంటూ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఓవ‌ర్‌గా రియాక్ట్ అయ్యార‌ని అంటున్నారు. 

త్వ‌ర‌లోనే మంత్రిమండ‌లి విస్త‌ర‌ణ అనే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో బ‌హుషా మినిస్ట‌ర్ పోస్ట్ ఆశించి.. జ‌గ‌న్‌ను ఇంప్రెస్ చేయ‌డానికే జోగి ర‌మేశ్ ఇలా అతిగా స్పందించార‌ని త‌ప్పుబ‌డుతున్నారు. అయ్య‌న్న‌పాత్రుడు మాట్లాడిన వాటినే బూతులంటే.. ఇక కొడాలి నాని వాడే భాష‌కు అంత‌కంటే దారుణ‌మైన పేరేదైనా పెట్టాల్సి ఉంటుంది. త‌మ పార్టీ మంత్రి నోరు మూయించ‌డం చేత‌గాక‌.. నోటికి ప‌ని చెప్పిన టీడీపీపై దండ‌యాత్ర‌కు దిగారు వైసీపీ నాయ‌కులు. జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ ఉండే చంద్ర‌బాబు ఇంటి ముట్ట‌డికి వ‌చ్చారు జోగి ర‌మేశ్ అండ్ బ్యాచ్‌. ఎక్క‌డో ఉత్త‌రాంధ్ర‌లో అయ్య‌న్న‌పాత్రుడు మాట్లాడితే.. ఇక్క‌డ ఉండ‌వ‌ల్లిలో చంద్ర‌బాబు ఇంటిపై దాడి చేయ‌డ‌మేంట‌ని నిల‌దీస్తున్నారు టీడీపీ శ్రేణులు.

ప‌క్కా ప్లాన్డ్‌గానే రాళ్లు, జెండా క‌ర్ర‌ల‌తో దాడి చేశారు వైసీపీ వ‌ర్గీయులు అంటున్నారు. చంద్ర‌బాబు ఇంటిపై వైసీపీ నేత‌ల దాడిలో పోలీసుల వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని.. ఒక‌రోజు ముందే ఫేస్‌బుక్‌లో ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ పోస్ట్ పెట్టగా.. పోలీసులు చంద్ర‌బాబు ఇంటికి క‌నీసం భ‌ద్ర‌త కూడా క‌ల్పించ‌లేద‌ని విమ‌ర్శిస్తున్నారు. జోగి ర‌మేశ్‌ను ఆయ‌న ఇంటి ద‌గ్గ‌రే క‌ట్ట‌డి చేయ‌కుండా.. చంద్ర‌బాబు ఇంటి గేటు వ‌ర‌కూ రానిచ్చార‌ని మండిప‌డుతున్నారు. రాళ్లు, క‌ర్ర‌ల దాడిలో బుద్ధా వెంక‌న్న‌లాంటి టీడీపీ నాయ‌కులు గాయ‌ప‌డినా పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని త‌ప్పుబ‌డుతున్నారు.

జ‌గ‌న్‌ను అయ్య‌న్న‌పాత్రుడు తిట్ట‌డ‌మే త‌ప్పు అయితే.. మ‌రి, రెండేళ్లుగా చంద్ర‌బాబును నోటికొచ్చిన‌ట్టు తిడుతున్న మంత్రి కొడాలి నానిది కూడా త‌ప్పేగా? చంద్ర‌బాబు ఇంటిని ముట్ట‌డించిన‌ట్టే.. టీడీపీ శ్రేణులు జ‌గ‌న్ ఇంటిని సైతం చుట్టుముట్టాలిగా? ముందుగా కొడాలి నాని నోరు పారేసుకున్నందున‌.. ఎమ్మెల్యే జోగి ర‌మేశ్‌ను మొద‌ట తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ ప్యాలెస్‌పై దాడి చేయాల‌ని.. ఆ త‌ర్వాతే ఉండ‌వ‌ల్లి రావాల‌ని లాజిక్కులు తీస్తున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ‌లా.. అయ్య‌న్నపాత్రుడి కామెంట్లు వైసీపీని ఉలిక్కిపాటుకు గురి చేశాయ‌ని అంటున్నారు.