Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్ లోని తమిళనాడు మాజీ సీఎం నివాసం సీజ్
posted on: Mar 31, 2026 9:33AM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో జయలలితకు చెందిన నివాసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ నివాసానికి సంబంధించి దీర్ఘకాలంగా ఇంటిపన్ను చెల్లించకపోవడంతో నిబంధనల మేరకు అధికారులు ఈ నివాసాన్ని సీజ్ చేశారు. మంగళవారం (మార్చి 31) ఉదయం ఇక్కడకు చేరుకున్న జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ ప్రక్రియను పూర్తి చేశారు.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఈ నివాసానికి సంబంధించి 83 లక్షల రూపాయల మేర ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోవడం, ఎన్నిమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. గతంలో జయలలిత హైదరాబాద్ సందర్శించిన సందర్భాలలో ఆమె ఇక్కడ బస చేసేవారు.
సినిమా రంగంలో అగ్రతారగా వెలిగి, ఆ తర్వాత తమిళనాడు రాజకీయాలను శాసించిన జయలలితకు దేశవ్యాప్తంగా అనేక చోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అయితే ఆమె మరణానంతరం ఈ ఆస్తుల నిర్వహణ విషయంలో స్పష్టత లేకపోవడంతో పన్నుల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలోని జయలలిత నివాసం ఎవరి పర్యవేక్షణలో ఉందన్న విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నివాసానికి చెందిన పన్ను బకాయిలను వారసులు లేదా ఈ ఆస్తిని పర్యవేక్షిస్తున్న బాధ్యులు చెల్లిస్తేనే ఈ సీజ్ తొలిగే అవకాశం ఉంది. ఒకవేళ బకాయిలు చెల్లించని పక్షంలో మున్సిపల్ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది.


.webp)
.webp)


