తగునా ఇది మంత్రివర్యా

మంత్రి శ్రీనివాస గౌడ్ ఆజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి  శ్రీనివాస గౌడ్ అత్యుత్సాహం ప్రదర్శించి వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధ్వర్యంలో జరుగుతున్న భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు నిర్వహించిన సంగతి విదితమే.

ఇందులో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి   పాల్గొన్నారు. ఉన్నట్లుండి అందరూ చూస్తుండగానే పక్కన ఉన్న పోలీసు నుంచి తుపాకి తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారు.

 ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసు అధికారులు కనీసం మంత్రిని వారించను కూడా వారించలేదు. తాను గాలిలోకి కాల్పులు జరుపుతున్న ఫొటోలను తలసాని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు తగునా ఇది మంత్రిగారూ అంటూ ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇలా ఉండగా తాను చేసిన పనిని మంత్రి   సమర్ధించుకున్నారు.

 భారీజ‌న సందోహం హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో పోలీసుల తుపాకీ తీసుకుని మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జ‌రుపుతారంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న నేపథ్యంలో  తాను కాల్చింది ర‌బ్బ‌ర్ బుల్లెట్ అని పేర్కొన్న శ్రీనివాస్ యాదవ్... తాను రైఫిల్ అసోసియేష‌న్ స‌భ్యుడిన‌ని,  క్రీడా శాఖ మంత్రిగా త‌న‌కు ఇలా గాల్లోకి కాల్పులు జ‌రిపే అర్హ‌త ఉంద‌ని మంత్రి చెప్పారు. అంతే కాకుండా తానేమీ పోలీసు చేతిలోంచి తుపాకీ లాక్కోలేదనీ, ఎస్పీయే స్వయంగా తనకు తుపాకీ అందించారని అన్నారు.