కేంద్రంలో సుస్థిర, నిర్మాణాత్మక ప్రభుత్వం.. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి.  ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.  స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి అంటే 2047 నాటికి భారత్  పూర్వ వైభవం, ఆధునిక కాలపు    సువర్ణాధ్యాయాల సమ్మేళనంతో వెలుగోందాలని ఆకాంక్షించారు.

 భారతదేశంమానవతా బాధ్యతలను నిర్వర్తింగల సామర్థ్యం కలిగి స్వయం సమృద్ధ దేశంగా నిలవాలని, వందేళ్ల స్వాతంత్ర్య భారత దేశం పేరరికం లేని సుసంపన్న దేశంగా నిలవాలని ద్రౌపది ముర్ము అన్నారు. . అది పేదరికం లేని భారతదేశం కావాలని, ఇందులో మధ్య తరగతి కూడా సంపన్నంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. నేడు భారత్ ఆత్మవిశ్వాసంలో అత్యున్నత స్థాయికి చేరుకుందనీ, ప్రపంచ దేశాలు మన దేశాన్ని చూసే దృక్కోణం మారిందన్నారు. ప్రపంచంలోని అన్ని సమస్యలకూ భారత్ సమాధానం చెప్పగలదనీ, పరిష్కారమార్గాలు సూచించగలదన్న ఆశతో ప్రపంచ దేశాలు ఉన్నాయన్నారు.  ఇందుకు దేశంలో స్థిరమైన, నిర్భయంగా నిర్ణయాలు తీసుకోగలిగిన ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉండటమే కారణమని ద్రౌపది ముర్ము అన్నారు.  జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం నుంచి ట్రిపుల్ తలాక్ రద్దు వరకు భారత  ప్రభుత్వం కీలకమైన  నిర్ణయాలు తీసుకుందని, అలాగే అవినీతి అంతానికి సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసిందని చెప్పారు.ప్రజాస్వామ్యానికి , సామాజిక న్యాయానికి  అతి పెద్ద శత్రువు అవనీతేనని పేర్కొన్నారు. 

అవినీతికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం కొనసాగుతోందన్నారు. జల్ జీవన్ మిషన్ కింద మూడేళ్లలో సుమారు 11 కోట్ల కుటుంబాలకు పైపుల ద్వారా నీటిని అందిచినట్లు పేర్కొన్నారు.   గతంలో పన్ను రిటర్న్ కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చేదని, ఇవాళ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసిన రోజుల వ్యవధిలోనే వాపసు లభిస్తోందన్నారు.  వివక్ష లేకుండా సమాజంలోని ప్రతి వర్గానికి పని చేసిందన్నారు. 

పూర్తి పారదర్శకతతో కోట్లాది మందికి  .27 లక్షల కోట్లకు పైగా విలువైన పథకాలు అందాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల ఆకాంక్షల్ని పూర్తి చేసిందన్నారు. ఇప్పుడు వారికి ప్రాథమిక సౌకర్యాలు లభిస్తున్నాయని, ఈ ప్రజలు కొత్త కలలను చూడగలుగుతున్నారన్నారు.

దేశంలోని 500 బ్లాకుల్లో వైబ్రెంట్ జిల్లాల కార్యక్రమం అమలవుతోందని రాష్ట్రపతి తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలను అభివృద్ధి చేయడానికి 'వైబ్రెంట్ గ్రామాలు' కార్యక్రమం కూడా ప్రవేశపెట్టామన్నారు. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పేదలకు జీవించడం ఎలా కష్టతరంగా మారిందో చూశామని, కానీ భారత్ లో మాత్రం పేదల జీవితాలను రక్షించడంతోపాటు దేశంలోని పేదలు ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రపోకుండా చూసేందుకు కేంద్రం ప్రయత్నించిందన్నారు.

మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పొడిగించాలని నిర్ణయించినందుకు సంతోషంగా ఉందని రాష్ట్రపతి తెలిపారు.   కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో మహిళా సాధికారత ప్రధానమైందని రాష్ట్రపతి తెలిపారు. ఈ రోజు మనం 'బేటీ బచావో, బేటీ పఢావో' విజయాన్ని చూస్తున్నామని, దేశంలో మొట్టమొదటిసారిగా పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువైందని, మహిళల ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగుపడిందని తెలిపారు.