గుజరాత్ అల్లర్ల కేసులో మోడీ నిరపరాధి..

సుప్రీంలో కాంగ్రెస్ ఎంపీ జకియా జఫ్రీకి చుక్కెదురైంది. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోడీకి దేశ సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ గతంలో స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్  తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆమె పిటిషన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ నాడు స్పెషల్ మెట్రో పాలటిన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది.   2002 ఫిబ్రవరి 28న అల్లరి మూకల దాడిలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ సహా 68 మంది మరణించిన సంగతి విదితమే.  

దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేశారు. నాటి అల్లర్లపై దర్యాప్తు జరిపిన సిట్ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ,  సహా మరికొందరికి అల్లర్లతో ఎటువంటి సంబంధం లేదని తేల్చింది.  అయితే నరేంద్రమోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఇషాన్ జఫ్రీ సతీమణి జకియా షఫ్రి పలు కోర్లులలో సవాల్ చేశారు.

అన్ని చోట్లే ఆమెకు చుక్కెదురైంది. దాంతో 2008 మార్చిలో జకియా షఫ్రి దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు సిట్ ను నియమించి అల్లర్ల కేసు దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో సిట్ ఈ అల్లర్లపై విచారణ చేపట్ఠింది.

2010లో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని దాదాపు 10 గంటల పాటు విచారించింది. అనంతరం సిట్ మోడీ నిరపరాధి అంటూ సుప్రీం కు నివేదిక సమర్పించింది. దీనిని సవాల్ చేస్తూ జకియా జాఫ్రి 2102లో మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. అంతకు ముందు అహ్మదాబాద్ హైకోర్టు కూడా సిట్ నివేదికను సమర్ధించింది.  ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఆ తీర్పునే సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది.