కరోనా కాలర్ టోన్ పై హైకోర్టు ఫైర్..  

ఒక సంవత్సరం నుండి మనం ఎవరికి కాల్ చేసిన. ఒక్కటే నసా.. కోవిద్ తో జాగ్రత్తగా ఉండండి. అప్రమతంగా ఉండండి. కరోనా గురించి మర్చిపోయి కాస్త ప్రశాంతంగా ఉందాం.. స్నేహితులకు ఎవరికైన ఫోన్ చేసి కాస్త కష్టాలు చెప్పుకుందాం అని అనుకున్న. ఫోన్ లో  కరోనా కాలర్ టోన్ మరింత భయపెడుతుంది. ఒక రకంగా జనాలను మానసికంగా హింసిస్తుంది. మన ఇమ్యూనిటీ ని తగ్గిస్తుంది. అప్పటి వరకు వేరే ఆలోచనలో ఉన్న మనం ఒక్క సారిగా కరోనా గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. మన బిపి లెవెల్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. చాలా మంది అనుకుంటారు ఇది మన జాగ్రత్త కోసం చెపుతున్నారని మనం అందరం అనుకుంటాం కానీ దీని వెనక పెద్ద తతంగం కూడా ఉండొచ్చు. మాథెర్స్ డే, ఫాథర్స్ డే, లవర్స్ డే రోజు కూడా ఇలా అన్ని ఫోన్ కి కాలర్ టోన్ పెట్టొచ్చుకదా.. అలా పెట్టారు. ఎందుకంటే దాని వల్ల దేశంలో ఉన్న రాబందువులకు ఎలాంటి లాభం ఉండదు కాబట్టి. ప్రజలు కూడా ఒక సారి ఆలోచించాలి.

తాజాగా ఈ కాలర్ టోన్ పైనఢిల్లీ హైకోర్టు కూడా ఫైర్ అయింది.. ఫోన్ చేయగానే తొలుత వినిపించే కరోనా కాలర్ ట్యూన్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో సరిపడా వ్యాక్సిన్లు లేకున్నా ఫోన్ చేసినప్పుడల్లా చిరాకుపరిచే ఆ కాలర్ ట్యూన్‌తో విసిగిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడింది. టీకాలు లేకున్నా తప్పకుండా టీకాలు వేసుకోమంటూ ఆ కాలర్ ట్యూన్ ద్వారా చెబుతున్నారని, వారికి టీకా ఎలా అందుతుందని, ఎవరు వేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది.

అసలు ఈ సందేశం ఉద్దేశం ఏమిటని నిలదీసింది. ప్రతి ఒక్కరికీ టీకా అందించాలి. చూస్తుంటే ఈ కాలర్ ట్యూన్ ఇంకో పదేళ్లు కొనసాగేలా కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఇంకేదైనా కొత్తది వింటే కొంత ఉపయోగకరంగా ఉంటుందని, ఒకవేళ డబ్బులు తీసుకున్నా పరవాలేదు కానీ అందరికీ అయితే టీకా ఇవ్వాలని జస్టిస్ విపిన్ సంఘి, రేఖా పల్లితో కూడిన ధర్మాసనం పేర్కొంది.