వివేకా హ‌త్య‌కేసు.. నిందితుడు శివ‌శంక‌ర రెడ్డికి  బెయిల్ నిరాక‌ర‌ణ‌

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డికి  సుప్రీంకోర్టు  బెయిల్  ఇచ్చేం దుకు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి సరైన కారణాలు తమకు కనిపించడంలేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. శివశంకర్‌రెడ్డి తరపున కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ కౌన్సిల్ అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.  వివేకానందరెడ్డి హత్యకేసులో తొలుత దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ లో శివశంకర్ రెడ్డి పేరు లేదని ఆయన వాదించారు. అప్రూవర్‌గా మారి న వాచ్‌మెన్ స్టేట్ మెంట్‌లో కూడా శివశంకరరెడ్డి పేరు లేదన్నారు. 

ఏ1 గా ఉన్న నిందితుడికి మూడు నెలల్లో బెయిల్ ఇచ్చారని, 11 నెలలు అవుతున్నా, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడం లేదని న్యాయవాది విన్నవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలే మని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. 

గ‌తంలోనూ  నిందితుల‌కు క‌డ‌ప కోర్టు బెయిల్ నిరాక‌రించింది. కేసులో ప్ర‌ధాన నిందితులుగా ఉన్న దేవి రెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి, ఉమాశంక‌ర్ రెడ్డిల బెయిల్ పిటిష‌న్ ను కోర్టు కొట్టివేసింది. నిందితుల బెయిల్ పిటి ష‌న్ పై వాద‌న‌లు ముగియ‌డంతో బెయిల్ పిటిష‌న్ల‌ను కోర్టు కొట్టి వేసింది. మ‌రోవైపు శివ‌శంక‌ర్ రెడ్డికి నార్కో ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి కోరుతూ సీబీఐ పులివెందుల కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కోర్టు పిటిష‌న్ స్వీక‌రించింది. ఈ కేసులో వరుసగా రెండు, మూడు, ఐదో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు జస్టిస్ డి.రమేష్ నిరాకరిం చారు. ఇద్దరు నిందితులు ఆరోగ్య కారణాలతో బెయిల్ కోసం ప్రయత్నించారు.