పోక్సో కేసులో కర్నాటక మాజీ సీఎంకు సమన్లు
posted on Nov 20, 2025 12:29PM

పోక్సో కేసులో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 2 లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ యెడ్యూరప్పకు సమన్లు జారీ చేసింది. యెడ్యూరప్పపై 2004లో పోక్సో కేసు నమోదైంది. సహాయం కోరేందుకు 2024 ఫిబ్రవరి 2న తన నివాసానికి వచ్చిన ఓ మైనర్ బాలికను యెడ్యూరప్ప లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదుపై అప్పట్లో సదాశివనగర్ పోలీస్ స్టేషన్ కేసు కూడా నమోదైంది.
ఈ కేసు విచారణలో భాగంగా యెడ్యూరప్ప వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ న్యాయస్థానం ఆయనకు తాజాగా సమన్లు జారీ చేసింది. అంతకు ముందు తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ యెడ్యూరప్ప ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా, ఆయన అభ్యర్థనను హకోర్టు ధర్మాసనం కొట్టివేసి, విచారణను ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిథుల కోర్టు యెడ్యూరప్పను వ్యక్తిగతంగా ఆదేశించాలంటూ సమన్లు జారీ చేయడం ప్రాథాన్యత సంతరించుకుంది.