బ‌డుల విలీనం..  త‌ల్లిదండ్రుల ఆగ్ర‌హం

అనుకున్నంతా అయింది. పాఠశాలల్లో తరగతుల విలీనం ప్రభుత్వబడులపై తీవ్ర ప్రభావం చూపింది. సర్కారు అంచనాలను తల కిందులు చేస్తూ ఏకంగా 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వబడులకు రాంరాం చెప్పేశారు. ఈ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లను 47.4 లక్షల మందికి ఇవ్వాలని అంచనా వేయగా ఈ ఆగస్టు 1వ తేదీ నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 41.2 లక్షలు మాత్రమే ఉంది. 

ఆరో తరగతి విద్యార్థుల సంఖ్య గతంలోకంటే పెరిగి సాధారణ స్థితికి వచ్చినా, ఒకటో తర గతిలో చేరేవారం సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది. ప్రభుత్వబడుల్లో విద్యార్థుల నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నం దున ఈ సంఖ్య స్వల్పంగా పెరిగి 42 లక్ష లకు చేరినా ఐదు లక్షలకు పైగా లోటు ఉంటుందని భావిస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో 45.71 లక్షల మంది విద్యా ర్థులు ప్రభుత్వబడుల్లో చదువుకున్నారు. కాగా ఇపుడు ఈ  గణాంకాల ప్రకారం చూస్తే, ఈసారి 4.55 లక్షల మంది బడికి దూరం కావ‌డం గ‌మ‌నార్హం. 

అస‌లు విలీనంతోనే స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.  ఈ ఏడాది ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన తరగతుల విలీన ప్రక్రియ తీవ్ర గందరగోళా నికి కారణమైంది. 5,870 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాథమికో న్నత, ఉన్నత పాఠ శాలల్లో విలీనం చేస్తున్నారు. చిన్న పిల్లలను దూరం పంపలేమని బడులు తెరిచిన రోజు నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ ప్రక్రియ ప్రాథమిక విద్యావ్యవస్థను గందరగోళం చేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెట్టాయి. కానీ విధానపర నిర్ణయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ప్రభుత్వం విలీనంపై భీష్మించింది. మొండిగా ముందడుగు వేసింది. దీంతో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వబడుల్లో చేరిక‌ల‌పై ఆందో ళన మొదలైంది.

దాదాపు ప‌ది శాతం విద్యార్థులు ప్రైవేటు బాట పట్టే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. అంతదూరం పంపడం తప్ప దనుకుంటే మా పిల్లలకు ప్రభుత్వబడి అక్కర్లేదంటూ అనేకచోట్ల తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. అందుకు అను గుణంగానే ప్రైవేటు పాఠశాలలకు క్యూ కట్టారు. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ స‌రికొత్త విధాన నిర్ణ‌యం ఎవ‌రినీ ఆక‌ట్టుకోవ‌డం లేదు. పైగా తీవ్ర నిర‌స‌న లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రి జ‌గ‌న్ స‌ర్కార్ త్వ‌ర‌లో మార్పులు చేర్పులు చేప‌ట్టి త‌ల్లిదండ్రుల‌కు న‌మ్మ‌కం క‌లిగించాలి.