ఒత్తిడిని తగ్గించే ఈ నూనెల గురించి తెలుసా..?

 


ఒత్తిడి చాలామందిని వేధించే సమస్య. ఇప్పటికాలం బిజీ జీవితాలలో ఒత్తిడి లేదు అంటే ఆశ్చర్యపోవాలి కానీ.. ఒత్తిడి ఉందంటే పెద్దగా వింతగా ఫీలవ్వాల్సింది ఏమీ లేదు. అయితే ఒత్తిడి సమస్య ఉంది కదా అని అందరూ అలాగే ఉండిపోరు.. ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్ర సమస్యకు దారితీస్తుందని వైద్యులు చెబుతూనే ఉన్నారు.  అందుకే ఒత్తిడి తగ్గించుకోవడానికి  వైద్యులను కలవడం నుండి,  జీవనశైలి,  ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వరకు చాలా పాటిస్తారు.  ఈ కోవకు చెందినదే ఒత్తిడి తగ్గించే నూనెలు వాడటం.  కొన్ని రకాల నూనెలు ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి.  అదేలా అంటే..

ఒత్తిడిని తగ్గించడంలో అరోమాథెరపీ చాలా బాగా పనిచేస్తుంది.  కొన్ని రకాల వాసనలు మనసుకు, మెదకుడు చాలా గొప్ప ఓదార్పును ఇస్తాయి.  ఇవి ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడం,  తగ్గించడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో పనిచేస్తాయి. అలాంటి నూనెలు ఏనో తెలుసుకుంటే..

లావెండర్ ఆయిల్..

లావెండ్ ఆయిల్ ను చాలా రకాలుగా ఉపయోగిస్తారు.  సోపులు,  పెర్ఫ్యూమ్, ఎయిర్ ఫ్రెషనర్లు, వివిధ రకాల క్రీములు మొదలైనవాటిలో ఉపయోగిస్తారు. లావెండర్ ఆయిల్ ను డిఫ్యూజర్ లో ఉంచవచ్చు లేదా చర్మానికి అప్లై చేయవచ్చు.  లేదంటే ఇంట్లోనే ఒక దీపం వెలిగించి దాని పైన ఒక చిన్న కప్ లో నీరు పోసి అందులో లావెండర్ ఆయిల్ ను కొన్ని చుక్కలు వేయవచ్చు. ఇది గది మొత్తాన్ని కూడా చాలా సువాసనా భరితంగా మార్చేస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది.

శాండల్ ఆయిల్..

శాండల్ ఆయిల్ లేదా గంధపు నూనె చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు, నిద్రపోయేముందు ఈ నూనెను  వాడితే చాలా మంచి ఫలితం ఉంటుంది.  ఇది మానసకి ఒత్తిడిని చాలా బాగా తగ్గిస్తుంది.


రోమరిన్ ఆయిల్..

రోమరిన్ ఆయిల్ అనేది ఒత్తిడిని తగ్గించడంలో మాత్రమే కాకుండా మానసిక అలసటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.  దీని సువాసన మానసికోల్లాసాన్ని ఇస్తుంది.

పిప్పరమెంట్ ఆయిల్..

పిప్పరమెంట్ చాలా రకాల ఆహారాలు,  ప్రోడక్ట్ లలో చూస్తుంటాం. ఇందులో ఉండే మెంథాల్ ఫ్లేవర్ కూలింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది.  పిప్పరమెంట్ ఆయిల్ వాసన తలనొప్పి, మానసిక అలసట,  మైగ్రేషన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది మానసకి శక్తి స్థాయిలను పెంచుతుంది.

జాస్మిన్ ఆయిల్..

జాస్మిన్ ఆయిల్ లేదా మల్లెపూల నూనె చాలా సువాసన కలిగి ఉంటుంది.  ఈ నూనె జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  ఏకాగ్రత పెంచడంలో సహాయపడుతుంది.  మానసిక ఒత్తిడిని చాలా సులువుగా తగ్గిస్తుంది.

ఆరెంజ్ ఆయిల్..

ఆరెంజ్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. మానసిక అలసటను తగ్గిస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్..

యూకలిప్టస్ ఆయిల్ లేదా నీలగిరి తైలం చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇందులో చాలా ఔషద గుణాలు ఉంటాయి.  ఈ నూనె జలుబు, దగ్గు, శ్వాస సంబంధ ఔషదాల తయారీలో ఉపయోగించబడుతుంది.   ఈ నూనెను వినియోగించి  ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.


                                          *రూపశ్రీ.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu