హర్మూజ్ లో కొత్త రూట్.. ఇరాన్, ఒమన్ మధ్యఒప్పందం.!

posted on: Aug 6, 2026 9:24AM

ప్రపంచ వాణిజ్య రవాణాకు గుండెకాయ వంటి  హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రత,  ప్రయాణం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  కీలకమైన  ఈ  సముద్ర మార్గంలో  కొత్త  వాణిజ్య నౌకాయాన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్,  ఒమన్ దేశాల మధ్య  అంగీకారం కుదిరింది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నడుమ, గల్ఫ్ లో గ్లోబల్  సరఫరా గొలుసు పునరుద్ధరించేందుకు ఈ ద్వైపాక్షిక దోహదపడనుంది. గత కొన్ని  నెలలుగా ఇరాన్,  ఒమన్ మధ్య   ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా  కొత్త    రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది.  సాంకేతిక, చట్ట, భద్రతా  కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు  సంబంధించి  ఇరు దేశాలు  ఓ అవగాహనకు వచ్చాయి.

హర్మూజ్ జలసంధిలో సురక్షితమైన వాణిజ్య నౌకాయానానికి వీలు కల్పించే దిశగా ఒమన్‌తో జరిపిన సంప్రదింపుల్లో   పురోగతి సాధించామని  రాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మీడియాకు వెల్లడించారు.    ఎటువంటి  అంతరాయాలు,  ఒత్తిళ్లు లేకపోతే.. అంగీకరించిన ప్రధాన మార్గదర్శకాలతో త్వరలోనే  ఈ విషయంపై ఇరాన్, ఒమన్ లు ఉమ్మడి   ప్రకటనను  విడుదల చేస్తాయి. గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకల కదలికలకు భద్రత  కల్పించేందుకు దాదాపు రెండు నెలలు  సాగిన  చర్చలు దాదాపు ఫలవంతమయ్యాయి. 

 ద్వైపాక్షిక అంగీకారం కుదిరినప్పటికీ, జలసంధిలో ప్రస్తుతానికి నూటికి నూరు శాతం   భద్రత ఏర్పడినట్లు భావించలేం.   అమెరికా వైఖరిలో మార్పు రానంత వరకు,  సముద్ర దిగ్బంధనాలు తొలగనంత వరకు జలసంధిలో నౌకల రవాణా  సురక్షితం కాదనే చెప్పాలి.  మరోవైపు..  ప్రాంతీయ ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు,  చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరాన్   దౌత్య మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే రెండు మూడు రోజులలో   ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ,  పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ పాకిస్థాన్,  ఖతార్ లలో పర్యటించనున్నారు. 

Strait of Hormuz, Iran Oman shipping route, commercial maritime security, Esmaeil Baghaei statement, Middle East shipping tension, Gulf trade route

google-ad-img
    Related Sigment News
    • Loading...