సింధియాకు అద‌నంగా ఉక్కుశాఖ బాధ్య‌త‌

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా  ఉక్కు మంత్రిత్వ శాఖ అదనపు బాధ్య‌తలు స్వీకరించారు. ప్రధాని నరేంద్రమోడి సలహా మేరకు రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ ప్రస్తుతం ఉన్న పోర్ట్ పోలియో తో పాటు ఉక్కు మంత్రిత్వ శాఖ ని కూడా  కేటాయీంచాలని ఆదేశించినట్టు అధికారిక  ప్రకటనలో తెలిపారు. 

రాజ్యసభ పదవీకాలం ముగియడం తో పదవికి రాజీనామా చేసిన ఆర్ సి పి సింగ్ స్థానంలో అయన  ఈ పదవి తీసుకు న్నారు. సింధియా  ప్రస్తుతం పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని నిర్వహిస్తు న్నారు. 51 ఏళ్ళ సింధియా  మధ్యప్రదేశ్ నుంచి రాజ్య సభకి ప్రాతినిద్యం వహిస్తున్నారు.

ఉక్కు శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ సింగ్, మంత్రిత్వ శాఖ ఉన్నత అధికారుల సమక్షం లో సింధియా బాధ్య‌తలు స్వీకరించారు. శ్రీ చంద్రప్రసాద్ సింగ్ స్థానంలో సింధియా  బాధ్య‌త‌లు తీసుకున్నారు. కిందటి ఏడాది జరిగిన మంత్రివ్యవస్థ పునర్వ్యవస్థీకరణ లో బాగంగా  స్కిల్ డెవలప్మెంట్, విద్యా మంత్రిత్వ శాఖలు కేటాయించి శ్రీ ధర్మేంద్ర ప్రసాద్  భ‌ర్తీ చేసారు. సింధియా  ప్రస్తుత మోడీ కాబినెట్ లో మూడో ఉక్కుశాఖా మంత్రి.