గ్లోబల్ టెండర్లలో  గోల్ మాల్ ? 

ఒక్క తెలంగాణ ప్రభుత్వమే కాదు  పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఇంకా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కొవిడ్ వాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించాయి. అయితే  మన దేశంలో ఇంతవరకు సీరం, భారత్ బయోటెక్   అభివృద్ధి చేసిన రెండు వాక్సిన్’లకు మాత్రమే అత్యవసర వినియోగం అనుమతి లభించింది. రష్యా స్పుత్నిక్’ ఇప్పటికే మన దేశానికీ చేరుకుంది, కానే, ఇంకా పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదు. మరో ఇలాంటి, పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా, గ్లోబల్ టెండర్లు పోవడం ఎందుకు? ముక్కేదంటే, తల చుట్టూ తిప్పి ముందున్న ముక్కును చూపించినట్లుగా, మాలీ మనదేశంలో తయారవుతున్న ఆ రెండు వాక్సిన్’లానే థర్డ్ పార్టీ ద్వారా కొనే ఉద్దేశంతో గ్లోబల్ టెండర్లకు పోతున్నారా? లేక ప్రపంచ దేశాలలో తయారవుతున్న 15 వరకు ఉన్న వాక్సిన్’లు అన్నింటినీ  గ్లోబల్ టెండర్’లో పాల్గొనేందుకు అనుమతిస్తారా? ఇలా తెలంగాణ సహా పలు రాష్ట్రాలు చేస్తున్న గ్లోబల్ టెండర్’ ప్రకటనలు, ప్రతిపాదనల పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్న కరోనా మందులు,వాక్సిన్ కొనుగోళ్ళ పేరిట తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి, పతక రచన చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఆరోపణల ప్రారంభించింది.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రతి చర్యను, ప్రతి నిర్ణయం విషయంలో రంధ్రాన్వేషణ చేసి, మరకలు బయతాకు తీసే కాంగ్రెస్ ఎంపీ రేవత్ రెడ్డి, గ్లోబల్‌ టెండర్ల ముసుగులో మంత్రి కేటీఆర్‌ మిత్రుల కంపెనీలకు రూ.కోట్లు దోచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్, కరోనా టాస్క్ ఫోర్సు  బాధ్యతలను మంత్రి కేటీఆర్ కు అప్పగించారని రేవంత్ ఆరోపించారు. అలాగే, దేశంలో రెండు కంపెనీల వ్యాక్సిన్‌ మాత్రమే వినియోగానికి అనుమతి ఉన్నప్పుడు గ్లోబల్‌ టెండర్లను పిలవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. అయితే ప్రపంచ దేశాలు తయారు చేస్తున్న వాక్సినలకు ఇప్పటికిప్పుడు అనుమతి లేక పోయినా, త్వరలోనే అనుమతులు వచ్చే అవకాసం ఉందని, ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

నిజానికి రెండు రోజుల క్రితం, బుధవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్ష వర్ధన్, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యూరప్, జపాన్ తయారు చేసిన వాక్సిన్లు, ప్రపచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో చేర్చిన వాక్సిన్లకు మన దేశం కూడా త్వరలోనే అత్యవసర వినియోగ అనుమతులు ఇస్తుందని ప్రకటించారు. అదే జరిగితే, ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతులకు అడుగు దూరంలోకి వచ్చిన రష్యా పుత్నిక్’తో పాటుగా ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడేర్నావాక్సిన్’లు అవసరానికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి ప్రకటించారు.కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం కానీ, మరో ప్రభుత్వం కానీ, గ్లోబల్ టెండర్ల ద్వారా అవసరమైన మేరకు, అందుబాటులో ఉన్నంత వరకు వాక్సిన్’  సమకూర్చుకోవడం తప్పుకాదని, నిపుణులు పేర్కొంటున్నారు. దహనం వేసినప్పుడు బావి తవ్వడం మొదలు పెడితే, ప్రాణాలు నిలబడవు, అని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

మరో వంక రేవంత్ రెడ్డి, కరోనా మొదటి వేవ్‌ సమయంలోనే కొవిడ్‌ నియంత్రణ, కిట్లు, మందుల కొనుగోళ్ల పేరుతో కోట్ల రూపాయల మేర  మేర అవినీతి జరిగిందని, దీనికి సంబంధించి విజిలెన్స్‌ నివేదికను ప్రభుత్వ పెద్దలు తొక్కి పెట్టారని కూడా ఆరోపించారు. మొదటి వేవ్‌ కరోనా ప్రభావం నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదని, రెండో వేవ్‌లో విజృంభణ తార స్థాయికి చేరాక నియంత్రణ పేరిట హడావుడిగా టాస్క్‌ఫోర్స్‌ను వేసిందని విమర్శించారు. అయితే గత 16 నెలలుగా కరోనాపై పోరాటం చేస్తున్న ఏ అధికారికీ ఆ కమిటీలో చోటు దక్కలేదన్నారు. మల్కాజ్‌గిరి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఎందుకు అడ్డు తగులుతున్నారని ప్రశ్నించారు. పీఎం కేర్‌ ద్వారా రాష్ట్రంలో ఒక్క ఆక్సిజన్‌ ప్లాంటైనా ఏర్పాటైందా..? అని ప్రశ్నించారు. కరోనా చికిత్స కోసం వినియోగించే వస్తువులపై 12 శాతం జీఎస్టీని రద్దు చేయాలని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో అడ్డా కూలీలు, ఆటో, టాక్సీ డ్రైవర్లకు నెలకు రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసే విమరలకు పెద్దగా విలువ ఉండదని, ఆరోపణలు  చేయడం, ప్రతి పనికి అడ్డుపుల్లలు వేయడం  కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అధికార పార్టీ నాయకులు కొట్టివేస్తున్నారు.