నటుడు అయ్యంగార్‌పై "మా" విష్ణుకు ఫిర్యాదు

 

మహాత్మా గాంధీ పై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య కర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యం గార్  పై  చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్...మా అసోషియేషన్ అధ్య క్షులు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశారు.... అక్టోబర్ రెండో తేదీన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజు సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అయ్యాంగర్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. 

అది చూసినట్టు డిజైన్లు విమర్శల వర్షం కురిపించారు. దీంతో సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అయ్యాంగర్ ఓ వీడియో విడుదల చేశారు. మహాత్మా గాంధీ గురించి ఓ పోస్టు పెడితే చాలా మంది విమర్శలు చేశారని వాటి గురించి నేను అంతగా పట్టించుకోనని... అయినా మహాత్మాగాంధీ గురించి మీకేం తెలుసురా... అంటూ మహాత్మా గాంధీ గురించి అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో చేశాడు. అయితే ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో... నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 

ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఈరోజు ఉదయం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు మనోజ్ ని కలిశారు. మహాత్మా గాంధీ పై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యాంగార్ పై తక్షణమే చర్యలు తీసు కోవాలి.. అంతేకాకుండా అతడి మా సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ మంచు మనోజ్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మా  అసోసియేషన్ విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని మంచు మనోజ్ తెలిపారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu