శ్రీరెడ్డికి ఒక కేసులో మాత్రమే బెయిల్ 

ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించిన  కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో రిలీప్ లభించింది. శ్రీరెడ్డిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి.  విశాఖపట్నంలో నమోదైన కేసులో హైకోర్టు కండీషన్ బెయిలు  మంజూరు చేసింది. వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని శ్రీరెడ్డిని ఆదేశించింది. మరోవైపు, చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్‌కు విచారణ అర్హత లేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.అనకాపల్లిలో నమోదైన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయిరోహిత్‌ వాదనలు వినిపించారు. సోషల్ మీడియా వేదికగా  శ్రీరెడ్డి అభ్యంతరకరమైన భాష వాడారన్నారు.. అయితే న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాలలోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు.
వైకాపా హాయంలో చెలరేగిపోయిన శ్రీరెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత  రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో  ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు ముందస్తు బెయిల్ కోసం శ్రీరెడ్డి హైకోర్టు నాశ్రయించారు. విశాఖ పట్నం కేసులో  శ్రీరెడ్డికి రిలీఫ్ వచ్చినప్పటికీ మిగతా ఐదు కేసుల్లో ఊరట లభించలేదు. 
తనపై కేసులు నమోదైన తర్వాత శ్రీరెడ్డి ఊసరవెల్లిగా  మారింది. వైకాపాను తిడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తింది.  లోకేశ్ అన్నా నన్ను క్షమించు అని ప్రాధేయపడి విమర్శలపాలైంది. . తాను తప్పు చేసినట్టు శ్రీరెడ్డి ఒప్పుకోవడం చర్చనీయాంశమైంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu