నాగలక్ష్మి శ్రీమంతురాలు.. సోనూసూద్   

సోను సూద్ ఆ పేరు వింటే చాలా మనోడికి అరుంధతి సినిమాలో నన్ను చంపి సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. తాను సినిమాలో విలన్ పాత్రలు వేసిన నిత్య జీవితంలో మానవత్వం ఉన్న మనిషి పక్కోడి కష్టాలను పంచుకునే విశాల హృదయం ఉన్న మహోన్నత మైన వ్యక్తి సోనుసూద్. కరోనా ప్రపంచాన్ని పీడిస్తుంటే, మరోవైపు దేశాన్ని ఏలుతున్న రాజకీయ నాయకులూ కరోనా మరణాల డ్రామా చూస్తుంటే. దాదాపు  నూట ముప్పై కోట్ల జనాభాలో ఒక దాన కర్ణుడు పుట్టాడు. ప్రజా సేవకుడు అయ్యాడు. ఎంతో మందికి ప్రాణ బిక్ష పెట్టాడు సోను సూద్. ఆయన  సేవ గుణానికి ఎంటరో ముగ్ధులయ్యారు. 

ఆమె ఒక అంధురాలు. ఆమె పేరు బొద్దు  నాగలక్ష్మి.  నెల్లూరు జిల్లా. వరికుంటపాడు మండలం. అండ్రావారిపల్లె. తన పింఛన్ సోనూసూద్ ఫౌండేషన్ కి లేచి, ఆమె సేవానిరతిని చాటుకున్నారు. తన అయిదు నెలల పింఛన్‌ మొత్తం రూ.15 వేలు సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళంగా అందించినట్లు గురువారం తెలిపారు. సోనూసూద్‌ను కలిసే అవకాశం వస్తే తాను దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చేస్తానని చెబుతున్నారు. ఈ సాయంపై సోనూసూద్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘నాగలక్ష్మి దేశంలోనే అత్యంత ధనవంతురాలు. ఇతరుల బాధను చూడడానికి కళ్లు అక్కరలేదు.. మంచి మనసుంటే చాలు’ అని కొనియాడారు.