తెలంగాణ తల్లి సోనియా

 

 

 

ఇప్పుడు తెలంగాణ తల్లికి మరికొన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ కష్టాలకు కారణం ఎవరో కాదు... కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరన్న. సోనియాగాంధీకి గుడి కట్టి తీరతానని శపథం చేసిన శంకరన్న తాజాగా ఓ సరికొత్త స్టేట్‌మెంట్ పడేశారు. తెలంగాణ తల్లి అంటే వేరే ప్రత్యేకంగా ఎవరో కాదంట.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీనే తెలంగాణ తల్లి అట! మితిమీరిపోయిన వ్యక్తిపూజకి ఇంతకంటే పరాకాష్ట మరొకటి వుంటుందా? ఈలెక్కన పొరపాటున తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ తల్లి పరిస్థితి ఏమైపోతుందో! టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వీధివీధిలో ఏర్పడే తెలంగాణ తల్లి విగ్రహాలలో కవితమ్మని చూసుకునే అదృష్టం కలుగుతుంది. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని రద్దు చేసి తెలంగాణ తల్లి పేరుతో సోనియాగాంధీ విగ్రహాలనే పెట్టేస్తారు. ఏదో కామెడీకోసం రాశారుగానీ నిజంగా అలా జరుగుతుందా అనుకుంటున్నారా.. పొరపాటున కూడా అలా అనుకోకండి. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడితే ఆ రాష్ట్రంలో ఏదైనా జరగొచ్చు!