‘బాహుబలి’లో సోనాక్షి లేదన్న రాజమౌళి
posted on Jun 1, 2013 7:10PM

ప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్న ‘బహుబలి ’ సినిమా కు సంబంధించి ఏదో ఒక రూమర్ రావడం, దానిపై రాజమౌళి స్పందించడం సర్వ సాదారణం అయిపోయింది. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ లో హీరోయిన్ గా అనుష్కను తీసివేసి, సోనాక్షి సిన్హాను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై రాజమౌళి ట్విట్టర్ లో స్పందించాడు. బాహుబలిలో సోనాక్షి నటించడం లేదని స్పష్టం చేశారు. అనుష్క లీడ్ హీరోయిన్ పాత్రకు ఖరారైందని, మరో హీరోయిన్ ఫైనలైజ్ కావాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా తాను కూడా ఈ చిత్రంలో నటించడం లేదని, కేవలం దర్శకుడిగా నా పని తెర వెనక మాత్రమే అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇలాంటి వార్తలు వినివిని చిరాకెత్తిన సినీ జనాలు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని అమోయమంలో పడిపోతున్నారని అంటున్నారు.