సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కారు ఢీకొని బాలుడి మృతి

 

 

ఓ కారు మితిమీరిన వేగంతో బీభత్సం.... ఓ చిన్నారి బాలుడి ప్రాణం ఖరీదు... దీపావళి పండుగ రోజు ఇంట్లో విషాద ఛాయలు అలుము కున్నాయి. మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్.. చేయకూడదంటూ పోలీసులు  హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. అయినా కూడా యువత ఆ మాటలను పెడచెవిన పెట్టి మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ఇతరుల మరణానికి కారకులవుతున్నారు. నిన్న దీపావళి పండుగ రోజు నార్సింగీ పరిధిలో ఓ కారు చేసిన బీభత్సానికి ఓ చిన్నారి బాలుడు మృత్యువాతపడ్డాడు. 

ఆ ఘటన పలువురి హృదయాలను కదిలించివేసింది... రంగారెడ్డి జిల్లా నార్సింగీ కి చెందిన నవీన్ కుమార్ దీపావళి పండుగ సందర్భంగా తన రెండు సంవత్సరాల కొడుకు కూషన్ జోయల్‌ను  తీసు కొని టపాసులు కోసమని బైక్ మీద ఖాజా గూడా వెళ్లారు. తిరిగి ప్రయాణంలో అల్కాపూర్ రాగానే వీరి ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుండి ఒక కారు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్టింది. 

ఆ తాకిడికి బైక్ పై ఉన్న తండ్రి కొడుకు ఇద్దరు ఎగిరి రోడ్డు మీద పడిపోయారు. వెనువెంటనే కారు చిన్నారిపై నుండి రయ్ రయ్ అంటూ దూసుకువెళ్ళింది. దీంతో తీవ్ర గాయాలైన చిన్నారి బాలుని వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆ బాలుడు మృతిచెందాడు. 

దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలను కొనుక్కొని తన కొడుకుతో పాటు సంతోషంగా ఆడుకోవాలని చూసిన ఆ తండ్రికి... తన చేతు ల్లోనే ప్రాణాలు విడిచిన కొడుకును చూస్తూ బోరున విలపించాడు... అతని రోదన చూసి స్థానికులు, వాహన దారులు కన్నీరు పెట్టుకున్నారు.

ఈ ఘటన పలువురి హృదయాలను కదిలించివేసింది. కొడుకు మరణ వార్త వినగానే తల్లి తన గారాల పట్టి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడంటూ  గుండెలు బాదుకుంది. నవీన్ కుమార్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu