రూ.78 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత

 

స్మగ్లర్లు కొత్త కొత్త వ్యూహాలతో డ్రగ్స్ ని రవాణా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి ఎత్తులను అధికారులు చిత్తు చిత్తు చేసి... జైలుకు పంపుతున్నారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్ర యంలో కస్టమ్స్ అధికారులు కొన్ని కోట్ల విలువ చేసే విదేశీ గంజాయిని పట్టుకుని... స్మగ్లర్ల ను కటకటాల వెనక్కి పంపిం చారు.. విదేశీ గంజా యిని అక్రమంగా తరలిస్తున్నట్లుగా కస్టమ్స్ అధికారు లకు విశ్వసనీయ మైన సమాచారం రావడంతో వెంటనే వారు ముంబై ఎయిర్ పోర్ట్ లో మాటు వేశారు. 

ఓ పదిమంది స్మగ్లర్లు బ్యాంకాక్ నుండి ముంబై అంతర్జా తీయ విమానాశ్ర యంలో దిగారు. వారి నడవడికపై అనుమానం కలిగిన కస్టమ్స్ అధికారులు వెంటనే వారందరినీ అడ్డుకున్నారు. అనంతరం కస్టమ్స్ అధికారులు స్మగ్లర్ల కు సంబంధించిన ట్రాలీ బ్యాగ్ స్క్రీనింగ్ చేయగా విదేశీ గంజాయి వ్యవహారం కాస్త బట్టబయలు అయింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అను మానం కలగకుండా గంజాయిని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి... ట్రాలీ బ్యాగ్ అడుగు భాగంలో దాచిపెట్టి పైన వస్తువులు పెట్టు కుని... దర్జాగా ఎయిర్ పోర్ట్ లో దిగి బయటికి వెళ్లేం దుకు ప్రయత్నిం చారు. 

ఈ కేటు గాళ్లు..... కానీ కస్టమ్స్ అధికారుల స్క్రీనింగ్ లో విదేశీ గంజాయి వ్యవ హారం కాస్త గుట్టు రట్టు అయింది. దీంతో కస్టమ్స్ అధికారులు వెంటనే అప్రమత్తమై 10 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.78 కోట్ల విలువచేసి 78 కేజీల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకు న్నారు. అనంతరం ఎన్డిపిఎస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu