Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సిట్ అధికారులు వేధిస్తున్నారు.. లాయర్ సమక్షంలో విచారణ.. కోర్టుకు సీఐ నాగరాజు లేఖ.!
posted on: Jul 3, 2026 2:41PM
.webp)
సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను 8 రోజుల పాటు విచారించేందుకు సిట్ అధికారులకు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. సీఐ నాగరాజు విజయవాడ కోర్టుకు రాసిన లేఖ సంచలనంగా మారింది. సాయి కృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సీఐ నాగరాజు కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, కస్టడీ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయనా లేఖలో కోరారు. తనను విచారించే ప్రక్రియ మొత్తం తన న్యాయవాదుల సమక్షంలోనే జరిగేలా ఆదేశాలివ్వాలని కూడా సీఐ నాగరాజు కోరారు. సిట్ అధికారులు వేధిస్తున్నారంటూ.. నిందితుడు కోర్టుకు లేఖ రాయడం సంచలనంగా మారింది.






