రెజ్లింగ్‌లో రజతం.. రాంబో రవికుమార్‌...

అరే, స్టార్ రెజ్ల‌ర్‌ సుశీల్‌కుమార్ లేక‌పోయే.. ఈసారి ఒలింపిక్స్ కుస్తీ పోటీల్లో ఒత్తి చేతుల‌తోనే ఇండియా తిరిగొస్తుందా? అని సందేహించారు చాలామంది. సుశీల్ లేక‌పోతేనేం.. తానున్నానంటూ విక్ట‌రీ సింబ‌ల్ చూపించారు ర‌వికుమార‌ఱ్ ద‌హియా. అన్న‌ట్టుగానే టోక్యో దంగ‌ల్‌లో తొడ‌గొట్టి వెండి ప‌త‌కం సాధించాడు. రెజ్లింగ్‌లో ఇండియాకు తిరుగులేద‌ని నిరూపించాడు. 

ఒలింపిక్స్‌లో భారత పతాకం మరోసారి రెపరెపలాడింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ విభాగంలో రవి కుమార్‌ దహియా 4-7 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఫైన‌ల్‌లో ఓడినా.. రజతంతో మెరిశాడు. స్వ‌ర్ణ ప‌త‌కం రష్యా ఎగ‌రేసుకుపోయింది. 

2012 తర్వాత రెజ్లింగ్‌ పురుషుల విభాగంలో భారత్‌కు పతకం సాధించిన ఘ‌న‌త‌ రవికుమార్‌కు ద‌క్కింది. సుశీల్‌కుమార్‌ 2008లో కాంస్య పతకం సాధించగా 2012లో రజత పతకం గెలుచుకున్నాడు. తొమ్మిదేళ్ల త‌ర్వాత‌.. రవికుమార్‌ రెజ్లింగ్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్‌ సాధించి చ‌రిత్ర సృష్టించాడు.