పెళ్లైన 13 రోజులకే యువతి ప్రెగ్నెన్సీ... యువకుడు షాక్
posted on Oct 12, 2025 4:53PM

వివాహం జరిగిన 13 రోజులకే ఒక నవవధువుకి విపరీ తమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో నవ వరుడు వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు చెప్పిన మాటలు విన్న నవ వరుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది... అనంతరం నవ వరుడు తన భార్య వద్దకు వెళ్లి అసలు నిజం చెప్పమని వేడుకున్నాడు. భార్య చెప్పిన షాకింగ్ న్యూస్ విని తనను మోసం చేశారంటూనవ వరుడు పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సిద్దిపేట జిల్లాలోని ములుగు లో నివాసముంటు న్న ఓ యువకుడు అంగరంగ వైభవం గా వివాహం చేసుకున్నాడు. తన జీవితంలోకి అడు గుపెట్టిన యువతిని సంతోషంగా చూసు కోవాలని అనుకు న్నాడు. అలా నవ వరుడు 12 రోజులు ఆనంద డోలికల్లో విహరించాడు... 13వ రోజు అనగా ఈనెల 8వ తేదీన నవవధువు తీవ్ర మైన కడుపు నొప్పితో బాధప డుతూ ఉండడం గమనించిన నవ వరుడు వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకు వెళ్ళాడు. ఆమెను పరీక్ష చేసిన వైద్యులు బయటికి వచ్చి అసలు విషయం నవవరుడికి చెప్పారు. వైద్యులు చెప్పిన మాటలు విన్న ఆ యువకు డికి నోట మాట రాలేదు. ఇదెలా సాధ్యం మాకు వివాహమై కేవలం 13 రోజులే అవు తుందని వైద్యులతో చెప్పాడు...
అనంతరం యువకుడు నేరుగా వెళ్లి నవ వధువును నిలదీసి అడిగాడు. దీంతో నవవధువు అసలు విషయం చెప్పింది... ఉదయ్ కిరణ్ అనే యువ కుడు ప్రేమ పేరుతో తనను శారీరకంగా లొంగ దీసుకున్నాడు.ఈ విషయం తెలు సుకున్న పవన్ కళ్యాణ్ అనే మరో యువకుడు నన్ను బెదిరింపులకు గురిచేసి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం నా తల్లి దండ్రులకు కూడా తెలుసు.... అయినా కూడా నా తల్లిదం డ్రులు ఈ విషయం దాచిపెట్టి మీకు ఇచ్చి వివాహం చేశారని నవవ ధువు అసలు విషయం చెప్పింది. తనను మోసం చేసి పెళ్లి చేశారని నవ వరుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.