Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నల్ల సముద్రంలో నౌకపై దాడి, భారతీయుడు మృతి.!
posted on: Jul 25, 2026 7:45AM

నల్ల సముద్రంలో వాణిజ్య నౌకల లక్ష్యంగా సాగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఈ నెల 18న ఎంవీ ఒమోర్ఫీ అనే వాణిజ్య నౌకపై రష్యా ప్రదేశిక జలాల్లో జరిగిన దాడిలో ఒక ఇండియన్ నావికుడు మృత్యువాత పడ్డారు. దాడి జరిగిన సమయంలో నౌకలో ఉన్న సిబ్బందిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు.
ఈ ఘటనపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం మృతి చెందిన భారతీయ నావికుడి భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించడం సహా, అతని కుటుంబానికి అవసరమైన అన్ని రకాల చట్టపరమైన, సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. అలాగే నౌకలో ఉన్న ఇతర భారతీయ సిబ్బంది సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి తగిన రక్షణ కల్పిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
కేవలం వారం రోజుల వ్యవధిలోనే భారతీయ నావికులు దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం ఇది రెండోసారి కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వారం ఆరంభంలో ఉక్రెయిన్‌లోని ఒడెశా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఎంవీ గోల్డెన్ లెపర్డ్ అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు మరణించిన సంగతి విదితమే.
Ship attacked in Black sea, Indian, died, Two others, safe, Telugu One



.webp)


