శంషాబాద్‌లో చిరుత సంచారం కలకలం
posted on Oct 3, 2025 3:06PM

శంషాబాద్ శివారులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతంలో చిరుత కనిపించిందంటూ గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఉన్న పెద్ద షాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. పొలం వద్ద పనిచేస్తున్న కొంత మంది రైతులకు చిరుత కనిపించింది. దీంతో భయబ్రాంతులకు గురైన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు.
అటవీ ప్రాంతంలో చిరుత ఆనవాళ్లు గుర్తించిన రైతులు తీవ్ర భయాందో ళనకు గురవుతు న్నారు పొలం వద్ద పనిచేస్తున్న రైతులపై దాడి చేసే అవకాశం ఉందంటూ రైతులు ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని పనిచేస్తున్నారు అటవీశాఖ అధికారులు వచ్చి ఆనవాళ్లు చూసి చిరుతను బంధించే ప్రయత్నం చేయా లని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు... సమాచారం అందుకున్న అటవీశాఖాధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు