దుబాయ్ లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయులు దుర్మరణం

posted on: Jun 9, 2026 8:46AM

ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన భారతీయ కార్మికుల జీవితాల్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. దుబాయ్‌లో సోమవారం (జూన్ 8) జరిగిన   రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయులు  దుర్మరణం పాలయ్యారు. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ రహదారిపై   జరిగిన ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది  తీవ్రంగా గాయపడ్డారు. సాంకేతిక లోపంతో  వల్ల ఒక భారీ ట్రక్కు అకస్మాత్తుగా  రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో.. అదే సమయంలో వెనుక నుంచి కార్మికులతో  వస్తున్న ఒక మినీబస్సు..  ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. కార్మికుల బస్సును డ్రైవర్ అతి వేగంగా నడపడం, వేగాన్ని నియంత్రించ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.  

సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులనుర హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద ఘటనపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.  మరణించిన  వారి  కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...