వ‌న్డే, టెస్టుల‌ను ర‌క్షించండి...ఐసీసీకి  క‌పిల్ విన్న‌పం

క్రికెట్ అంటే ఆల్‌వైట్స్‌లో ఐదురోజులు జ‌రిగే టెస్టు మ్యాచ్‌నే అస‌లు క్రికెట్ అంటారు. పాత‌కాలం ప్లేయ ర్లు దానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తారు. మంచి ప్లేయ‌ర్ స‌త్తాను టెస్ట్ క్రికెట్ తెలియ‌జేస్తుంద‌ని అంటారు. ఎందుకంటే ఐదు రోజుల ఆట‌లో ఎంతో నిల‌క‌డ‌గా, ఓపిక‌తో ఆడ‌వ‌ల‌సి వ‌స్తుంది. అదే క్రికెట‌ర్ ల‌క్ష‌ణం అంటారు. అయితే చాలాకాలం నుంచి ఆధునిక క్రికెట్‌లో మ‌కుటాయ‌మానంగా వ‌న్డేలు, ఆ త‌ర్వాత అతి పొట్టి ఫ‌ర్మాట్‌గా టీ-20 పోటీలు వ‌చ్చేశాయి. 

వన్డే, టెస్టు క్రికెట్‌ బతికి బట్టకట్టేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో మరింతగా దృష్టి సారించాలని కోరాడు. మరోవైపు ఐసీసీ మాత్రం వచ్చే సైకిల్‌లో వన్డే క్రికెట్ విషయంలో ఎలాంటి తగ్గుదల లేదని ఐసీసీ పేర్కొంది. వచ్చే 9 సంవత్సరాలకు 3.. 50 ఓవర్ల ప్రపంచకప్‌లను షెడ్యూల్ చేసింది. భార‌త్‌ ఆతిథ్యం ఇవ్వనున్న 2023 ప్రపంచకప్‌తో ప్రారంభం అవుతుంది. 

పొట్టిఫార్మాట్ల  ఆట అందం కంటే స్కోరు బోర్డు ప‌రిగెత్తించ‌డ‌మే జ‌రుగుతోంది. ఈ రెండు ఫార్మాట్లు కూడా బౌల‌ర్ల కంటే బ్యాట‌ర్‌, ఫీల్డ‌ర్ ప‌టిమ‌నే తెలిజేస్తాయి. కేవ‌లం సిక్స్ లు, ఫోర్లు బాదే వాడే గొప్ప ప్లేయ‌ర్‌గా అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకుంటు న్నాడు. క‌నుక ఈ ఫార్మాట్ అస‌లు సిస‌లు క్రికెట్ అనిపించుకోద‌న్నది భార‌త్ లెజెండ్ క‌పిల్ దేవ్ అభిప్రాయం. కానీ ఆయ‌న అభి ప్రాయాన్ని చాలా మంది త‌ప్పు ప‌ట్టారు. కాలానుగుణంగా ఆట‌లో వ‌స్తున్న మార్పుల‌ను కూడా అంగీక‌రించా ల్సిందేన‌ని, పొట్టి ఫార్మాట్‌ను లెక్క‌లో కి తీసుకోవాల‌నే గ‌వాస్క‌ర్ వంటివారి వాద‌న‌. 

ఐపీఎల్, బీబీఎల్ వంటి పొట్టిఫార్మాట్‌లకు క్రేజ్ పెరుగుతూ సంప్రదాయ టెస్టు, వన్డే క్రికెట్‌పై మోజు తగ్గి పోతుండడంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. వన్డే, టెస్టు ఫార్మాట్‌ను రక్షించాలంటూ ఐసీసీ కి మొరపెట్టుకున్నాడు. టీ20, ఫ్రాంచైజీ క్రికెట్ లీగుల సంప్ర దాయ క్రికెట్‌ను వెన క్కి నెట్టకుండా చూడాలని కోరాడు. యూరప్‌లో క్రికెట్ ఫుట్‌బాల్ దారిలోనే నడుస్తోం దన్న కపిల్.. రోజు రోజుకు ద్వైపాక్షిక క్రికెట్‌కు ప్రాధాన్యం తగ్గిపోతోందన్నాడు.

 ఐసీసీ తదుపరి అంతర్జాతీయ క్యాలెండర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చేరగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా తమ దేశవాళీ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్స్ కోసం ప్రత్యేక స్లాట్స్ పొందే అవకాశం ఉంది. వారు ఒక్కో దేశంతో ఆడడం లేదని, నాలుగేళ్ల కోసారి ప్రపంచకప్‌లోనే అది జరుగుతోందని, ఇదేమంత ఆరోగ్య‌క‌ర  సంప్రదాయం కాద‌ని క‌పిల్ అన్నారు.