మరో వివాదంలో సల్మాన్
posted on Nov 14, 2014 3:01PM

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మీద మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన మీద ఇప్పటికే వన్యప్రాణులను వేటాడిన కేసు, ప్రమాదకరంగా వాహనం నడిపి ప్రాణాలు తీసిన కేసుతోపాటు మరికొన్ని కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఇప్పుడు బిగ్‌బాస్ రియాల్టీ షోలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారన్న వివాదంలో ఇరుక్కున్నారు. హైదరాబాద్‌కి చెందిన ఒక వ్యక్తి సల్మాన్ మీద మతపరమైన ఆరోపణలు చేస్తున్నారు. సల్మాన్ హోస్ట్‌గా వున్న బిగ్‌బాస్ రియాల్టీ షోలో కుక్కను స్వర్గంలా చిత్రీకరించారని, ఈ విషయాన్ని 2013 డిసెంబర్ 13వ తేదీన ఫలక్‌నుమా, అక్టోబర్ 2న బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లలో తాము సల్మాన్‌ఖాన్‌పై ఫిర్యాదు చేశామని, ఇంతవరకు పోలీసులు చట్టపరమైన విచారణ, దర్యాప్తుగానీ జరపలేదని చెప్పారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తన సోదరి పెళ్లి కోసం వస్తున్న సల్మాన్‌ఖాన్‌ను పోలీసులు విచారించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.