దొంగ‌లు ప‌డ్డార‌నుకుని హోట‌ల్లోంచి పారిపోయారు!

అర్ధ‌రాత్రి దాటాకో, తెల్లారిగ‌ట్టో ఎవ‌రో వ‌చ్చిన‌ట్ట‌యింది.పెద్దావిడ త‌లుపు తీసింది. వ‌చ్చిన‌వాడి మొహం స‌రిగా క‌న‌ప‌డ‌లేదు. అంతే చేతి క‌ర్ర‌తొ నెత్తిన ఠ‌పీమ‌ని ఒక్క‌టిచ్చుకుంది.. నేనే మామ్మా.. అంటూ మ‌న‌వడు గుమ్మంలోనే ప‌డిపోయాడు! అయ్యో దొంగ‌నుకున్నార్రా..అంటూ త‌ర్వాత స‌ప‌రిచ‌ర్య‌లూ చేసింది మ‌నవ‌డికి. ఒక్కోసారి ఇలాంటి సంఘ‌ట‌న‌లూ జ‌రుగుతూంటాయి.  బ్రెజిల్ లోనూ జ‌రిగింది.

జాగింగ్‌, ర‌న్నింగ్ చేసేవారు వాళ్లు ప‌రిగెత్తాల్సిన ట్రాక్‌లో వెళ్ల‌కుండా అలా ప‌రిగెడుతూంటారు.  రోడ్డు ప‌క్క నే స‌ర‌దాగా కాల‌క్షేపం చేస్తూ టిఫిన్ తిన‌డానికి ఈమ‌ధ్య అన్ని ప‌ట్ట‌ణాల్లోనూ ఓపెన్ రెస్టారెంట్లు వ‌చ్చేశాయి. బ్రెజిల్  రెకీఫీ లోని  ఒక న‌గ‌రంలో ఇలాంటిదే ఒక‌టి ఉంది. ఈమ‌ధ్య ఓ సాయింత్రం కొంత మంది అలా స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూన్నారు. అంత‌లో ఎవ‌రో ప‌రిగెడుతూ రావ‌డం ఓ అమ్మాయి చూసింది. ముందు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎదుటివారితో మాట్లాడుతూనే ఎందుకో భ‌యంతో వెన‌క్కి తిరిగి చూసింది. అంతే ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ప‌రుగున వ‌స్తుండ‌డం చూసి భ‌య‌ ప‌డింది. 

ఎవ‌రో దొంగ‌లు పోలీసుల నుంచి త‌ప్పించుకుంటూ పారిపోయి రెస్టారెంట్లోకి వ‌చ్చేస్తున్నార‌నుకుంది. అంతే వెంట‌నే ప‌ర్సు చేతిలో కి తీసుకుని టిఫిన్‌, కాఫీలు వ‌దిలేసి రోడ్డుమీద‌కి ప‌రిగెట్టింది. ఆమె ను చూసి మిగ‌తా అంద‌రూ కూడా పారిపోయాడు. ఆ రెస్టారెంటువాడికి ఏమీ అర్ధంగాక ప‌రుగున లోప‌ల్నించి బ‌య టికి వ‌చ్చేస‌రికి ఈ న‌లుగురు ర‌న్న‌ర్స్ న‌వ్వుకుంటూ ప‌రిగెడుతూ వెళ్ల‌డం చూశాడు. ఓరి మీ దుంప తెగ మీ ర‌న్నింగ్‌కి ఈ దారే దొరికిందా.. కొంప‌లు ముంచేరుక‌ద‌రా! అని గోల్లుమ‌న్నాడు. పోలీసుల‌కు ఫోన్ చేశాడు. తీరావ‌చ్చి అక్క‌డి సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే, వారు దొంగ‌లు కాదు రోడ్డుకి అవ‌త‌లే ఉన్న జిమ్ స‌భ్యుల‌ని తేలింది.

త‌ర్వాత ఏమ‌యిందీ త‌ర్వాత సంగ‌తి. ముంద‌యితే, పాపం ఆ రెస్టారెంట్‌వాడికి మాత్రం ఆ పూట న‌ష్ట‌మే వ‌చ్చింది. చాలామంది రోజూ వ‌స్తూపోతూంటారు. ఇటాంటి సంఘ‌ట‌న ఒక్క‌టి చాలు రెస్టా రెంట్ దెబ్బ‌తిన‌డానికి. రేప‌ట్నుంచీ జ‌నం వ‌చ్చినా వెన‌కా ముందూ చూసుకుంటూ, భ‌యం భ‌యంగానే టీ  కాఫీ తాగాలేమో!  అన్న‌ట్టు మీ వూళ్లో ర‌న్న‌ర్లు స‌రిగానే  వెళ్లాల్సిన దారిలోనే  ప‌రిగెడుతున్నారా?