స్టాంప్ మాట‌కు అర్ధం అప్పుడూ ఇప్పుడూ ఒక్క‌టేనేమో!

ఒక‌రిని అన్న‌పుడు తామూ ప‌డాలిగ‌దా!  బిజెపికీ ఈ సూత్రం వ‌ర్తిస్తుంది. గ‌తంలో మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధా నిగా వున్న‌పుడు ఆయ‌న్ను సోనియా మాట జ‌వ‌దాట‌డ‌ని, కాంగ్రెస్ స్టాంప్ ప్ర‌ధాని అంటూ  తోచిన‌ట్టు కామెంట్లు చేసిన విప‌క్షాల మాట ఇపుడు బిజెపి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి ముర్మీ విష‌యంలో విన‌వ‌స్తుంటే ఇబ్బం దిగా మారింది. రాష్ట్ర‌ప‌తి స్థాయిలో వుండేవారు ఏ ప్ర‌భుత్వానికి ప‌క్ష‌పాత ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించ‌రు. కానీ ప్ర‌స్తుతం బిజెపి కోరి వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తి మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తిని చేయాల‌న్న ప‌ట్టుద‌ల వెనుక వారికి అనుకూలించే వ్య‌క్తి ఉన్న‌త ప‌ద‌విలో వుండ‌టం అవ‌స‌ర‌మ‌న్న ఆలోచ‌నకే బ‌లాన్నిస్తోంది. 

ఒరిస్సాకి చెందిన ముర్మీ ఎంపిక గురించి  విప‌క్షాల త‌ర‌ఫున అధ్య‌క్ష‌ప‌ద‌వి పోటీలో వున్న య‌శ్వంత్ సిన్హా చేసిన ర‌బ్బ‌ర్ స్టాంప్ కామెంట్‌కు బిజెపీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. ఒక ఆదివాసీ మ‌హిళ‌ను ఉన్న‌త స్థానంలోకి తీసుకోవ‌డంలో బిజెపికి మ‌రో ఆలోచ‌న లేద‌ని, సిన్హా చేసిన కామెంట్ విప‌క్షాల మాన‌సిక వైఖ రిని తెలియ‌జేస్తుంద‌ని బిజెపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సి.టి.ర‌వి వ్యాఖ్యానించారు. కానీ, మోదీ నాయ క‌త్వంలోని బిజెపి ప్ర‌భుత్వం ఏదీ త‌మ‌కు అన‌నుకూల‌మైన‌దిగా తీసుకోర‌ని అంద‌రికీ తెలిసిన‌దే. ముర్మీ ఎంపిక వెనుక త‌మ పార్టీ, ప్ర‌భుత్వం వెనుక‌బ‌డిన వ‌ర్గాల ప‌ట్ల ఎంతో గౌర‌వం వుంద‌న్న‌ది ప్ర‌ద‌ర్శించ‌డా నికి త‌ప్ప వాస్త‌వానికి వారు వారి ప్ర‌గ‌తికి చేసిందేమీ లేద‌న్న అభిప్రాయాలు, నినాదాలే దేశ మంతా విన బ‌డుతున్నాయి. వాటిని దాట‌వేయ‌డానికి ఇపుడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భాన్ని త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌నుకున్నారు. 

అందుకే గ‌ట్టి అభ్య‌ర్ధి కోసం వెతికి వేసారే బ‌దులు వెనుక‌బ‌డిన జాతికి చెందిన మ‌హిళ‌ను పోటీకి దింప‌డం స‌మంజ‌స‌మ‌ని బిజెపీ అభిప్రాయ‌ప‌డింది. ఈ నెల 18వ తేదీ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. త‌ప్ప‌కుండా తమకు కావ‌ల‌సిన అభ్య‌ర్ధి గెల‌వాలంటే ముర్మీ కంటే త‌గిన అభ్య‌ర్ధి వేరెవ్వ‌రూ వుండ‌ర‌ని బిజెపి వ‌ర్గీయు లు న‌మ్మారు. ఇలాగ‌యితేనే విప‌క్షాల అభ్య‌ర్ధి రాజ‌కీయాల‌ల్లో ఆరితేరిన య‌శ్వం త్ సిన్హాను ఓడించ‌డానికి అవ‌కాశం వుంటుంది. 

ప్ర‌స్తుతం య‌శ్వంత్ బంగ‌ళూరులో ప్ర‌చారంలో వున్నారు. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ స‌మావేశంలో మాట్లాడు తూ బిజెపి ప్ర‌భుత్వం చాలారోజులుగా ఇ.డి, సిబిఐ, ఐటీ శాఖ‌ల‌ను త‌న‌కు అనుకూలించే విధంగా ఉప యోగిస్తూన్న‌ద‌ని విమ‌ర్శించారు. త‌మ విరోధుల ఆట‌క‌ట్టించేందుకు బిజెపి ప్ర‌భుత్వం ఎప్పుడూ ఈ స్వ‌తంత్ర సంస్థ‌లను అస్త్రాలుగా వాడుతోంద‌న్నారు. కేంద్రం మాట, ఆదేశానుసార‌మే ఆ సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయి. అందుకు వుదాహ‌ర‌ణే బిజెపీయేత‌ర పార్టీ నాయ‌కుల ఆస్తులు, నివాసాల‌పై ఇ.డి, ఐ.టీ దాడులు మితిమీరి జ‌ర‌గ‌డం. ఈ సంగ‌తి ప్ర‌జ‌లంద‌రికీ అర్ధ‌మ‌యింది. భ‌విష్య‌త్తులో రాజ్యాంగ ప‌ర‌మైన అంశాల్లో త‌మ‌కు ఎదురులేకుండా చేసుకోవ‌డానికే బిజెపి వ‌ర్గం ముర్మీని  రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి త‌గిన అభ్య ర్ధిగా ప్ర‌చారం చేస్తోంది.  ఇది మోదీ రాజ‌కీయ‌చ‌తుర‌త తెలిసిన అంద‌రి మాట‌. 

మోదీ టీమ్ మ‌ళ్లీ ఒక్క‌టి గుర్తుంచుకోవాలి.  గ‌తంలో చేసిన కామెంట్లు త‌మ‌వారి విష‌యంలోనూ విన‌వ‌స్తుం టాయ‌న్న‌ది. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌హ‌యాంలో మ‌న్మోహ‌న్ సింగ్‌ను విప‌క్షంలో వుండ‌గా ర‌బ్బ‌రు స్టాంప్ ప్ర‌ధాని అంటూ అప‌హాస్యం చేసిన‌వారు దాన్ని అంత సుల‌భంగా మ‌ర్చిపోవ‌డం త‌గ‌దు. ముర్మి విష‌యంలో మోదీ ఎంతో అద్భుతంగా ప్ర‌చారం చేసుకున్న‌పుడు ఆమె రాష్ట్ర‌ప‌తిగా బిజెపీ ప్ర‌భుత్వానికి ర‌బ్బ‌రుస్టాంప్ రాష్ట్ర‌ప‌తిగా మార‌వ‌చ్చ‌న్న కామెంటు నీ అంతే  సుల‌భంగా తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్ర‌భ‌త్వం అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ త‌మ‌కు అనుకూలించే విధంగా ప‌నిచేసేలా మార్చేశాయి గ‌నుక‌. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి విష‌యంలో బిజెపి ఎంపిక చేసుకున్న ముర్మీ వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన వ్యక్తే కావ‌చ్చ‌, గ‌తం లో  ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గిరీ చేప‌ట్టి వుండ‌వ‌చ్చు. కానీ ప్ర‌స్తుత‌ రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆమెను రాష్ట్ర ప‌తి అభ్య‌ర్ధిగా తీసుకురావ‌డంలో అంత‌రార్ధం త‌మ‌కు భ‌విష్య‌త్తులో రాజ్యాంగ‌బ‌ద్ధ‌, చ‌ట్ట‌బ‌ద్ధ వ్య‌వ‌హారాల్లో ఎలాంటి అడ్డంకులైనా తొల‌గించుకోను వీలుండేందుకు అనే భావ‌నా ప్ర‌క‌టిత‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో నే బ‌హుశా య‌శ్వంత్ సిన్హా  ఆమెను బిజెపి వారి ర‌బ్బ‌రు స్టాంప్ అని కామెంట్ చేసి వుండ‌వ‌చ్చు.  మ‌రి బిజెపీ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం కూడా రిటార్ట్‌ను అంగీక‌రించాల్సిందేగా!